పోలీస్​స్టేషన్​పై గ్రామస్తుల దాడి.. ఏడుగురు పోలీసుల‌కు తీవ్ర గాయాలు.. కార‌ణ‌మదేనా?  

By Rajesh KarampooriFirst Published Sep 18, 2022, 6:21 AM IST
Highlights

బీహార్​లోని కాటిహార్​ జిల్లాలో​ పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ మద్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి కస్టడీలో చనిపోవడం వల్ల అతడి గ్రామస్థులు దాడికి దిగారు.

క‌ల్తీ మ‌ద్యం కేసులో అదుపులోకి తీసుకున్న వ్య‌క్తి  అనుమానాస్పద రీతిలో జైలులోని మరణించాడు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మృతుడి గ్రామ‌స్థులు పోలీసు స్టేష‌న్ పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో  ఇద్దరు స్టేషన్ ఇన్‌చార్జ్‌లు (ఎస్‌హెచ్‌ఓలు) సహా ఏడుగురు పోలీసులను తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఛప్రాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ లో జ‌రిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. శుక్రవారం రాత్రి  ప్రాణ్​పుర్​ పోలీసులు . అమ్డోల్ గ్రామానికి చెందిన ప్రమోద్​ కుమార్​ సింగ్​(40)ను కల్తీ మద్యం కేసులో అరెస్టు చేశారు.  అయితే శనివారం ఉదయం.. అతడు అనుమానాస్పద రీతిలో జైలులో శ‌వ‌మై క‌నిపించాడు. దీంతో పోలీసులు అత‌డిని కస్టోడియన్ హత్య చేసినట్లు భావించిన వందలాది మంది గ్రామస్తులు ప్రాణ్‌పూర్ పోలీస్ స్టేషన్​లో చొరబడి గొడవ సృష్టించారు. స్టేష‌న్  ఆవరణలో పార్క్ చేసిన ప‌లు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు స్టేషన్ ఇన్‌చార్జ్‌లు (ఎస్‌హెచ్‌ఓలు) సహా ఏడుగురు పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. వారిని కాటిహార్​ జిల్లా ఆస్పత్రికి అధికారులు తరలించారు. 

ఈ ఘ‌ట‌న‌పై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దయాశంకర్ మాట్లాడుతూ.. ప్రమోద్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గాయపడిన ఎస్‌హెచ్‌ఓలలో ఒకరు ప్రాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మణితోష్ కుమార్, దండ్‌కోహ్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన శైలేష్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, గాయ‌ప‌డిన పోలీసులందరినీ కతిహార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, మా బృందాలు ఆ ప్రాంతంలో క్యాంపింగ్ చేస్తున్నాయని తెలిపారు. 

 ప్రమోద్ కుమార్ సింగ్ మరణవార్త తెలియగానే గ్రామస్తులు కర్రలు, ఇనుప రాడ్లతో పోలీసు స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను గాయపరిచారు. ప్రమోద్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దయాశంకర్ తెలిపారు.

బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 5, 2016న రాష్ట్రంలో మద్యం తయారీ, వ్యాపారం, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ 2016ని ఉల్లంఘించిన వారికి శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది.

click me!