అపోలోలో చేరిన అద్వానీ ... నిలకడగా ఆరోగ్య పరిస్థితి

Published : Jul 03, 2024, 11:11 PM ISTUpdated : Jul 03, 2024, 11:13 PM IST
అపోలోలో చేరిన అద్వానీ ... నిలకడగా ఆరోగ్య పరిస్థితి

సారాంశం

దేశ మాజీ ఉపప్రధాని, భారతరత్న ఎల్‌కే అద్వానీ వృద్దాప్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. 

LK Advani Health : భారత మాజీ ఉపప్రధాని, బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణా అద్వాని మళ్ళీ హాస్పిటల్లో చేరారు. 96 ఏళ్ళ వయసులో వృద్దాప్యంతో బాధపడుతున్న ఆయన తరచూ హాస్పిటల్ పాలవుతున్నారు. ఇలా తాజాగా ఆయన దేశ రాజధాని న్యూడిల్లీలోని అపోలో హాస్పిటల్లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. 
  
అద్వానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఆయన ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో అపోలో వైద్యబృందం మాజీ ఉపప్రధానికి చికిత్స అందిస్తున్నారు. 

ఇటీవల కూడా ఇలాగే అద్వానీ అనారోగ్యంతో బాధపడుతూ డిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చికిత్స అందించారు. దీంతో పరిస్థితి కాస్త మెరుగుపడటంతో  డిశ్చార్జ్ చేయగా కుటుంబసభ్యులు ఇంటికి తరలించారు. కానీ మళ్ళీ వారంరోజుల గడవకుండానే అద్వానీ ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఈసారి అపోలోకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్