
ముంబై: Shiv Sena లో చోటు చేసుకొన్న సంక్షోభం నేపథ్యంలో Maharashtra Assembly రద్దు చేసే యోచనలో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల క్రమం శాసన సభ Dissolution దిశగా ఉందని శివసేన అధికార ప్రతినిధి Sanjay Raut ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై శివసేన అధికారికంగా ఈ విషయమై స్పష్టం చేయలేదు. మరో వైపు ఇవాళ Uddhav Thackeray కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ రద్దు చేసేందుకే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారనే ప్రచారం కూడా లేకపోలేదు.మరో వైపు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ ప్రొఫైల్ లో మంత్రి హోదాను తొలగించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం బుధవారం నాడు ముంబైలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేత కమల్ నాథ్ హాజరయ్యారు. మహారాష్ట్రలో చోటు చేసుకొన్న పరిణామాలు రాజ్యాంగానికి విరుద్దమని Kamalnath అభిప్రాయపడ్డారు. ఈ తరహా రాజకీయాలు భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
శివసేనకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు mumbai లోని హోటల్ లో ఉంచారు. ఈ ఎమ్మెల్యేలను కలిసేందుకు ఎవరికీ కూడా అనుమతి ఇవ్వడం లేదు.
ఇవాళ ఉదయం తాను Eknath Shinde తో గంటపాటు మాట్లాడాను. ఏక్‌నాథ్ సిండేతో చర్చల సారాంశాన్ని తాను ఉద్దవ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లినట్టుగా సంజయ్ రౌత్ చెప్పారు. ఏక్‌నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేలతో తాము నిరంతరం చర్చలు సాగిస్తున్నామని సంజయ్ రౌత్ చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలు మాట వినకపోతే తాము అధికరాన్ని కోల్పోతాం, అంతకంటే ఏం జరగదు, మరో ప్రభుత్వం ఏర్పాటు కానుందని కూడా సంజయ్ రౌత్ చెప్పారు. కానీ తాము పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా రౌత్ చెప్పారు.