లౌకికవాదం ఇండియాకు పెద్ద ముప్పు.. దేశాన్ని ఎదగనివ్వడం లేదు: యోగి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 8, 2021, 4:58 PM IST
Highlights

దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. 

దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు.

‘‘గ్లోబల్ ఎన్‌సైక్లోపీడీయా ఆఫ్ ది రామాయణ’’ అన్న కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... దేశానికి లౌకికవాదం అతిపెద్ద ముప్పూ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ముప్పు ప్రపంచ యవనికపై భారత్‌ను ఎదగనీయకుండా చేస్తోందని చెప్పారు. కొన్ని స్వార్థ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ.. దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని.. డబ్బుల కోసం దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వారు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని యోగి హెచ్చరించారు.

ఇప్పటికీ కొందరు రాముడి ఉనికిని ప్రశ్నించే వారున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చిన్న చిన్న మత వివాదాలు చేస్తూ, దేశంలో వున్న సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీయవద్దని యోగి హితవు పలికారు. 

click me!