నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి.. పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం.. పిటిషనర్ కు చురకలు ..

By Rajesh KarampooriFirst Published Nov 14, 2022, 4:00 PM IST
Highlights

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి రోజైన జనవరి 23న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది కేకే రమేశ్‌ సుప్రీంకోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. జనవరి 23న నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో దాఖాలైంది. అయితే.. ఈ విషయంపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు పిల్‌ను కొట్టివేసింది.  
  

ఈ పిటిషన్‌ను కొట్టివేసిన భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. దేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశిష్ట సేవలందించారనీ, ఆయనను గుర్తుంచుకోవడానికి ఉత్తమ మార్గం.. సెలవులను తీసుకోవడం కాదనీ, నేతాజీ ఎంత కష్టపడి పనిచేశారో, అదే విధంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం కష్టపడి ఆయన జయంతిని జరుపుకోవాలని సీజేఐ అన్నారు. ఈ పిటిషన్ లో ఆడిగిన ప్రశ్న.. పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదన్నారు.

పిటిషనర్‌కు సీజేఐ చురకలు 

ఈ వ్యవహారంలో పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మందలించారు. ఇలాంటి పిటిషన్ల వల్ల సమయం వృథా అవుతుందని, పిల్ మెకానిజం దుర్వినియోగం అవుతుందన్నారు. ఇతరుల పిల్‌లను విచారించడం సమయం వృధా అని పిటిషనర్ కెకె రమేష్ తరఫు న్యాయవాది జయ సుకిన్‌కు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
 
నేతాజీ జయంతి 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897న కటక్‌లో జన్మించారు, బోస్ తండ్రి పేరు జానకీనాథ్ బోస్ , తల్లి పేరు ప్రభావతి. బ్రిటిష్ వారి నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో నేతాజీ ముఖ్యమైన పాత్ర పోషించారని భావిస్తారు. బ్రిటీష్ వారితో పోరాడేందుకు 1943 అక్టోబర్ 21న 'ఆజాద్ హింద్ ఫౌజ్'ని స్థాపించాడు.

click me!