కిషన్ రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు..సయ్యద్ సుజా

Published : Jan 23, 2019, 12:17 PM IST
కిషన్ రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు..సయ్యద్ సుజా

సారాంశం

బీజేపీ నేత కిషన్ రెడ్డి తనను చంపాలనుకున్నాడంటూ సయ్యద్ సుజా పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ పై సయ్యద్ సుజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేత కిషన్ రెడ్డి తనను చంపాలనుకున్నాడంటూ సయ్యద్ సుజా పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ పై సయ్యద్ సుజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్ హౌజ్ లో తమపై కాల్పలు జరిపారని అతను తెలిపారు.

2014 మే13 తెల్లవారుజామున 13మందితో కలిసి  కాకిరెడ్డి గెస్ట్ హౌజ్ కి వెళ్లామని ఆయన చెప్పారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. మమ్మల్ని చంపేయాలంటూ తమ గన్ మెన్లను ఆదేశించారన్నారు.వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11మంది చనిపోయారని ఆయన వెల్లడించారు. కాగా.. తాను మాత్రం తప్పించుకోగలిగానని.. తర్వాత అమెరికా పారిపోయినట్లు చెప్పారు. వాళ్ల గన్ మెన్లతో చంపించి.. తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని ఆయన ఆరోపించారు.

విన్ సొల్లూషన్స్ ద్వారా ఈసీఐఎల్ కు టెక్నికల్ సహకారం అందించామని సయ్యద్ సుజా చెప్పారు.  విన్ సొల్యూషన్స్ లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో తనను మనీష్ సిసోడియా, అర్ణబ్ గోస్వామి, వంశీరెడ్డి కలిశారని.. ఈసీఐఎల్ లో పనిచేస్తున్న సమయంలో కూడా వంశీరెడ్డి కలిశారని చెప్పారు.వీవీప్యాట్ లో బగ్ ఫిట్ చేయమని తనను వంశీరెడ్డి అడిగారని చెప్పారు. తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !