విషమంగా శశికళ ఆరోగ్యం..!

By telugu news teamFirst Published Jan 22, 2021, 12:19 PM IST
Highlights

జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. 
 

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆమె బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కరోనా సోకిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. 


ఇదిలా ఉంటే, అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన శశికళ.. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూలో చేరారు. దాంతో ఆమె ఆరోగ్యపరిస్థితి ఎలా వుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదలై చెన్నై రావాల్సిన శశికళ.. ఈలోపే అస్వస్థతకు గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

click me!