ఆర్టికల్ 370 రద్దు: 4 గంటల ఆలస్యంగా ఢిల్లీ చేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్

Siva Kodati |  
Published : Aug 09, 2019, 11:33 AM IST
ఆర్టికల్ 370 రద్దు: 4 గంటల ఆలస్యంగా ఢిల్లీ చేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్

సారాంశం

భారత్-పాకిస్తాన్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దాయాది దేశం ఇప్పటికే మనదేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే భారత్-పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో భారత భూభాగంలోకి వచ్చేందుకు పాక్ సిబ్బంది నిరాకరించడంతో ఈ రైలు నిన్న వాఘా సరిహద్దులో నిలిచిపోయింది.

దీంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత రైల్వే అధికారులు ఒక ఇంజిన్, సిబ్బందిని పంపి రైలును పంజాబ్ రాష్ట్రంలోని అటారికి తీసుకొచ్చారు.

అలా భద్రతా సిబ్బంది సంరక్షణలో నిన్న రాత్రి అటారీ చేరుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ తనిఖీల అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ బయల్దేరి దాదాపు 4.30 గంటల ఆలస్యంగా 8 గంటలకు దేశ రాజధానికి చేరుకుంది.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య సిమ్లా ఒప్పందం ప్రకారం.. ఢిల్లీ-లాహోర్‌ల మధ్య వారానికి రెండు రోజులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?