యూపీ ఉపముఖ్యమంత్రికి సీఎం సీటు ఆఫర్ ఇచ్చిన అపోజిషన్ పార్టీ.. డిప్యూటీ సీఎం ఏం అన్నారంటే?

By Mahesh KFirst Published Dec 2, 2022, 4:05 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. యూపీ డిప్యూటీ సీఎం.. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన తమ పార్టీ 100 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కావాలనే ఆఫర్ ఇస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రియాక్ట్ అయ్యారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంకు సీఎం అయ్యే ఆఫర్‌ను అపోజిషన్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారని ఆయన అన్నారు. వారిద్దరూ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారని, ఇప్పటికీ సీఎం కావడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వారికి తాన ఒక ఆఫర్ ఇస్తున్నారని తెలిపారు. వంద మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను మద్దతుగా తీసుకోవాలని, తమ ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి కావాలని ఆఫర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రియాక్ట్ అయ్యారు.

అఖిలేశ్ యాదవ్ ఆఫర్‌ను తాను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలందరూ గూండాలు అని, అందుకే వారిని తమ పార్టీలోకి కూడా తీసుకోబోమని పేర్కొన్నారు. 

Also Read: ఉపఎన్నిక‌లో ఆగిన అఖిలేష్ యాద‌వ్ సైకిల్.. యూపీలో ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఇవే.. !

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బైపోల్స్ ఈ నెల 5వ తేదీన జరుగుతున్నది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండనుంది. మెయిన్ పురి బైపోల్స్ సమాజ్‌వాదీ పార్టీకి బలమైన స్థానం. ఇక్కడి నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్ నెల 10వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో మెయిన్‌పురి స్థానం ఖాళీ అయింది.

click me!