ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, హనుమంతులను మించిన దౌత్యవేత్తలు లేరు: కేంద్ర మంత్రి జైశంకర్

By Rajesh KarampooriFirst Published Jan 30, 2023, 1:53 AM IST
Highlights

శ్రీ కృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని  కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్‌సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

భగవన్ శ్రీకృష్ణ, హనుమాన్ ప్రపంచంలోనే చాలా గొప్ప దౌత్యవేత్తలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఆయన తన పుస్తకం 'ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్' మరాఠీ అనువాదం 'భారత్ మార్గ్'ను పూనేలో విడుదల చేశారు. ఈ సందర్భంగా  ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దౌత్య వ్యవహారాల విషయంలో రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. ప్రతిదీ భారతదేశంలోనే ఉందని అన్నారు.


శ్రీకృష్ణుడు , హనుమంతుడు ప్రపంచంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తలని, వారిని మించిన వారు లేరని అన్నారు. శ్రీరాముడు అప్పగించిన పనిని చాలా సమర్థవంతంగా చేశారనీ,  హనుమంతుడు లంకలో ఉన్న సీతాదేవిని కలిశాడనీ, కీడు తలపెట్టిన రాక్షస  లంకను దహనం చేశాడని అన్నారు. 

అలాగే..  శ్రీ కృష్ణుడు కూడా చాలా అత్యుత్తమ దౌత్యవేత్త అనీ, వ్యూహాత్మక సహనాన్ని వివరిస్తూ.. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పులు చేసేంత వరకు ఏమీ చేయనని హామీ ఇచ్చాడనీ.. తర్వాత చెప్పినట్లుగానే వంద తప్పులు పూర్తయ్యాకే సంహరించాడు. సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తుల లక్షణం అలానే ఉంటుందని జై శంకర్ వ్యాఖ్యానించారు. మహాభారతం ద్వారా ఈరోజు అంతర్జాతీయ సంబంధాల్లో ఏం జరుగుతుందో అలాంటి 10 కాన్సెప్ట్‌లను ఇవ్వగలనని జైశంకర్ అన్నారు.

కౌరవులు మరియు పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రాన్ని "మల్టీపోలార్ ఇండియా"గా పోల్చారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇతర రాష్ట్రాలచే నిర్బంధించబడకుండా దాని స్వంత జాతీయ ప్రయోజనాలను , ఇష్టపడే విదేశాంగ విధానాన్ని కొనసాగించగల సామర్థ్యమని అన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బైపోలార్ కోల్డ్ వార్ (1947-1991), యూనిపోలార్ టైమ్స్ (1991-2008), మల్టీపోలార్ టైమ్స్ (2008-ప్రస్తుతం) సమయంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. 

"వ్యూహాత్మక మోసం" గురించి మాట్లాడుతూ.. అర్జునుడి కొడుకు అభిమన్యుడిని కౌరవులు దారుణంగా చంపారనీ, తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, అర్జునుడు మరుసటి సాయంత్రంలోగా జయద్రథ (ప్రధాన దోషి)ని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడని తెలిపారు.  అయితే.. కౌరవులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జయద్రథుడిని సాయంత్రం వరకు దాచిపెట్టారని తెలిపారు. 

అలాగే.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మంత్రి జైశంకర్ మండిపడ్డారు. చైనా విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అన్నారు. 1962లో మన భూమిని చైనా ఆక్రమించిందని ఆయన స్పష్టంగా చెప్పారని, అయితే ఇటీవల జరిగినట్లుగా కొందరు చెబుతున్నారన్నారు. గత ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లలో భారత్‌లో భారీ మార్పు వచ్చిందని విదేశాంగ మంత్రి చెప్పారు. 'స్వయం సమృద్ధిగా' మారిన తర్వాత, దేశం అగ్రగామిగా మారుతుందని అన్నారు. 

click me!