భార్యకు కరెంట్ షాక్.. ఇంకా ప్రాణం పోలేదని గొడ్డలితో.. మెడ, తలపై నరికి.. ఓ భర్త ఘాతుకం...

Published : Jan 10, 2022, 08:10 AM ISTUpdated : Jan 10, 2022, 08:30 AM IST
భార్యకు కరెంట్ షాక్.. ఇంకా ప్రాణం పోలేదని గొడ్డలితో.. మెడ, తలపై నరికి.. ఓ భర్త ఘాతుకం...

సారాంశం

ఆదివారం వేకువజామున నిద్రిస్తున్న ఆమెను లేపి.. హాలులోకి తీసుకువచ్చి.. నిర్బంధించాడు. ఆ తరువాత విద్యుత్ తీగల సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చాడు. అయినా భార్య ప్రాణం పోకపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా ఆమె మెడపైన.. తల పైన నరికి హతమార్చాడు.  

బల్లార్ష :  కలకాలం కలిసి ఉంటానని మాట ఇచ్చిన భర్తే.. Current shock ఇచ్చి,, ఆపై axeతో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్రీ తాలూకా బంగారం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్స్పెక్టర్ జీవన్ రాజగురు తెలిపిన వివరాల మేరకు…  బంగారం తడోది గ్రామానికి చెందిన రాజు భావనే (43), యోగిత (35) దంపతులు.  వీరికి ఒక కుమారుడు ఓంకార్ (14).

శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న Dispute చినికి చినికి గాలివాన అయ్యింది. ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని రాజు పన్నాగం పన్నాడు. ఈ మేరకు ఆదివారం వేకువజామున నిద్రిస్తున్న ఆమెను లేపి.. హాలులోకి తీసుకువచ్చి.. నిర్బంధించాడు. ఆ తరువాత విద్యుత్ తీగల సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చాడు.

అయినా భార్య ప్రాణం పోకపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా ఆమె మెడపైన.. తల పైన నరికి హతమార్చాడు.  ఆ తరువాత వెంటనే పురుగుల మందు తాగి తానూ Suicide కు ప్రయత్నించాడు. అయితే.. ఈ క్రమంలో తల్లి వేసిన కేకలకు పక్కగదిలో నిద్రిస్తున్న కుమారుడు మేలుకున్నాడు.

అతడు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. దంపతులిద్దరిని గోండ్ పిప్రీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భార్య యోగిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త రాజుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

ఇదిలా ఉండగా, కర్ణాటకలో ఓ భర్త ఇలాంటి దారుణానికే తెగబడ్డాడు. పెళ్లి రోజే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. నిరుడు డిసెంబర్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జనవరి 8న వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజు నాడు సాధారణంగా ఎవ‌రైనా త‌న జీవిత భాగస్వామికి స‌ర్ ప్రైజ్ ఇద్దామ‌నుకుంటారు. 

భ‌ర్త‌.. భార్య‌కు చీర‌నో, నగలో, ఫ్ల‌వ‌ర్ బొకేనో లేదా త‌న‌కు ఇష్ట‌మైన స్వీట్స్, హాట్స్ ఇలా తీసుకెళ్తారు. ఇంకొంద‌రు తనకు తెలియ‌కుండా స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసి.. ఎక్క‌డికైనా టూర్ కు తీసుకెళ్ల‌డ‌మో.. లేదంటే త‌న‌కు ఇష్టమైన‌వి ఇవ్వడమో, చేయ‌డ‌మో చేస్తుంటారు. 

ఈ విషయంలో భార్య‌లు కూడా అంతే.. తమ మ్యారేజ్ యానివ‌ర్స‌రీకి భ‌ర్త‌కు ఎలాంటి గిఫ్ట్ ఇద్దామా? అని ఆలోచిస్తారు. అతనికి ఇష్టమైన ఫుడ్ వండిపెట్టడం.. బట్టలు కొనివ్వడం లేదా పెన్నో, ఫోనో..ఇలా ఇస్తుంటారు. అలా తమపెళ్లి రోజును సెల‌బ్రేట్ చేసుకుంటారు. 

అయితే ఓ భ‌ర్త మాత్రం మ్యారేజ్ యానివ‌ర్స‌రీకి భార్య ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చాడు. బ‌హుశా ఏ భార్య కూడా భ‌ర్త నుండి ఇలాంటి గిఫ్ట్ ను కోరుకోదు. ఈ సర్ ఫ్రైజ్ ను ఆశించదు. బహుశా కనీసం భర్త ఇలాంటి ప‌ని చేస్తాడ‌ని ఊహించ‌దు. అదేంటంటే..

క‌ర్నాట‌క రాష్ట్రం చిత్ర‌దుర్గ ప్రాంతానికి చెందిన సుమ (26) నార‌ప్ప ఇద్దరు దంప‌తులు. వీరిద్ద‌రికి పెళ్ల‌యి ఏడాది అవుతోంది. అయితే గ‌త నెల డిసెంబ‌ర్ 25వ తేదీన నారప్ప భార్య సుమ‌ను చంపేశాడు. త‌రువాత ఆమె మృత‌దేహాన్ని బాత్ రూమ్‌లో పూడ్చేశాడు. అయితే సరిగ్గా అదే రోజు వారి పెళ్లి రోజు కావ‌డం గ‌మ‌నార్హం. 

త‌రువాత తెలియ‌న‌ట్టు  త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అత‌డి తీరుతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి ఇళ్లంతా త‌నిఖీ చేశారు. వారికి బాత్రూంలో పూడ్చిపెట్టిన సుమ మృతదేహం దొరికింది. భ‌ర్త నార‌ప్ప‌ను పోలీసులు విచారించ‌గా.. తానే చంపేసిన‌ట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే