ఐఏఎస్ అధికారిణిల మధ్య గొడవ.. మంత్రి ఏమన్నారంటే..

By telugu news teamFirst Published Jun 5, 2021, 8:30 AM IST
Highlights

తాజాగా ఈ సమస్యను సద్దుమణిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా.. తాజాగా ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్టీ సోమశేఖర్ స్పందించారు. 

కర్ణాటకలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తనను వేధిస్తున్నారంటూ మైసూర్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ఆరోపణలు చేశారు. ఆ వేధింపులు తాను తట్టుకోలేకపోతున్నానంటూ  ఆమె ఏకంగా రాజీనామా కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరి పాకం అయ్యింది. వీరిద్దరి మధ్య తేడాలు కరోనా కట్టడి విషంయలో రావడం గమనార్హం. 

కాగా.. తాజాగా ఈ సమస్యను సద్దుమణిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా.. తాజాగా ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్టీ సోమశేఖర్ స్పందించారు. ఒక రెండు రోజులు ఆగితే.. ఈ సమస్య సద్దుమణుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన ముఖ్యమంత్రి అండర్ లో ఉందని ఆయన చెప్పారు.

చీఫ్ సెక్రటరీ పి. రవికుమార్.. మైసూర్ వెళ్లి.. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇద్దరు ఐఏఎస్ అధికారులతో విడివిడిగా చర్చలు జరిపారు. ఇద్దరి అభిప్రాయాలను తీసుకొని.. దీనిపై రిపోర్టు తయారు చేసి.. ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. 

ఇదిలా ఉండగా..  డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తనను వేధించారని.. ఆ వేధింపులు తట్టుకోలేక తాను రాజీనామా చేస్తున్నానంటూ మరో అధికారిణి శిల్పా నాగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు ఆమె రాజీనామాను ఇంకా ఆమోదించకపోవడం గమనార్హం. 

click me!