రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి..

Published : Aug 23, 2023, 11:16 AM IST
రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి..

సారాంశం

రాజస్తాన్ లోని దౌసాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

రాజస్థాన్ : రాజస్థాన్‌లోని దౌసాలో ట్రక్కు ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనంలో ఆరుగురు చనిపోయారు. ఈ మేరకు పోలీసులు నిర్ధారించారు. రాజస్థాన్‌లోని దౌసాలోని మందావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

"మాందావర్ PS పరిధిలోని ఉక్రుంద్ గ్రామం సమీపంలో ఒక ట్రక్కు వాహనాన్ని ఢీకొట్టింది, ఇందులో ఆరుగురు మరణించారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ జైపూర్‌కు తరలించారు. మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు" అని ఏఎస్పీ బజరంగ్ సింగ్ షెకావత్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు