Jharkhand లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

Published : Jan 01, 2022, 03:55 AM IST
Jharkhand లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

సారాంశం

 నూతన సంవత్సరం వేళ ఝార్ఖండ్​లో పెను విషాదం చోటు చేసుకుంది. పాలము జిల్లా పంకీ గ్రామానికి చెందిన కూలీలు శుక్రవారం సాయంత్రం సొంతూరుకు తిరిగి వస్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు.

Road accident: నూత‌న‌ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఝార్ఖండ్​లో పెను విషాదం చోటుచేసుకుంది. పొట్ట‌కూటి కోసం ప‌క్క రాష్ట్రానికి వెళ్లి.. స్వ‌గ్రామానికి తిరిగి వ‌స్తున్న వేళ‌ కూలీల‌ను రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో  ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్లోని పాలము జిల్లాలో జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. ఝార్ఖండ్​లోని పాలము జిల్లా పంకీ గ్రామానికి చెందిన కూలీలు ప‌ని నిమిత్తం.. బిహార్​లోని సిహుడీ గ్రామం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కూలీలంద‌రూ స్వ‌గ్రామానికి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు.  ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్​ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్కడికక్కడే మ‌ర‌ణించ‌గా..  మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరోవైపు గాయపడిన 18 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!