డిల్లీ విమానాశ్రయంలో ఆర్జేడి ఎమ్మెల్యే అరెస్ట్...

By Arun Kumar PFirst Published Feb 22, 2019, 6:09 PM IST
Highlights

బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) పార్టీ ఎమ్మెల్యే ఒకరిని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తుపాకీ బుల్లెట్లను  విమానంలో తరలిస్తుండగా సదరు ఎమ్మెల్యే డిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 
 
బిహార్ రాష్ట్రంలోని మధేపురా నియోజకవర్గం నుండి ఆర్జేడి పార్టీ నేత చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయన వ్యక్తిగత పనులపై పాట్నా విమానాశ్రయం నుండి డిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడి లగేజిని తనిఖీ చేశారు. అందులో పది తుపాకీ బుల్లెట్లను అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు ఎమ్మెల్యే వద్ద లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమాయుధాల చట్టం కింద చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆర్జేడి ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తీసుకుని ఆయన ఎందుకు డిల్లీకి వచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

click me!