Lok Sabha Elections 2024 : దేశంలోనే అత్యంత ధనిక, అతిపేద ఎంపీలు వీళ్లే.. తెలుగోళ్లే టాప్ 

By Arun Kumar PFirst Published Apr 5, 2024, 12:23 PM IST
Highlights

2024 లోక్ సభ ఎన్నికల వేళ దేశంలోనే అత్యంత ధనిక మరియు అతి పేద ఎంపీలు ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. అయితే రెండిట్లోనూ ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలో టాప్ 5 లో నిలిచారు. 

మారుతున్న కాలంతో పాటే ఎన్నికలు కూడా మారిపోయాయి... గతంలో పార్టీ, అభ్యర్థి ప్రొపైల్ చూసి ఓట్లు పడేవి. కానీ ప్రస్తుతం అభ్యర్థి ఎవరన్నది కాదు... ఎంత ఖర్చుచేసారన్నది గెలుపు సూత్రంగా మారింది. లోక్ సభ, అసెంబ్లీ నుండి సాధారణ సర్పంచ్ ఎన్నికల వరకు ధనప్రవాహం లేనిదే ఎన్నికలు జరగడం లేదు. ఇలాంటిది ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి... దీంతో ఈసారి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎవరెంత ఖర్చు చేస్తారనే చర్చ సాగుతోంది. అత్యంత ధనిక, అతి పేద ఎంపీలు ఎవరన్నది తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 లోక్ సభ ఎన్నికల వివరాల ప్రకారం ఈ ధనిక, పేద ఎంపీల్లో అత్యధికంగా తెలుగువారు మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు వున్నారు. 

అత్యంత ధనిక ఎంపీలు :  

1. నకుల్ నాథ్ : 2019 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా లోక్ సభ నుండి పోటీచేసిన నకుల్ నాథ్ అత్యంత ధనిక ఎంపీగా రికార్డు సృష్టించారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ తనయుడే ఈ నకుల్. అతడి ఆస్తుల విలువ రూ.660 కోట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ పేర్కొంది. 

2. హెచ్. వసంతకుమార్ : కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ హెచ్. వసంతకుమార్ సంపన్న ఎంపీల జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 417 కోట్లు. 

3. డికె సురేష్ : బెంగళూరు రూరల్ ఎమ్మెల్యే డికె. సురేష్ రూ.338 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. 

4. రఘురామ కృష్ణంరాజు :ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీచేసిన ఆయన ఆస్తుల విలువ రూ.325 కోట్లు. ప్రస్తుతం ఈయన వైసిపికు దూరమయ్యారు. 

5. గల్లా జయదేవ్ : ఆంధ్ర ప్రదేశ్ కే చెందిన మరో ఎంపీ  గల్లా జయదేవ్  ఐదో స్థానంలో నిలిచారు. టిడిపి ఎంపీగా కొనసాగుతున్న ఆయన 2019 ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.305 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నారు. 

అంత్యంత పేద ఎంపీలు :

గొడ్డేటి మాధవి : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అరకు లోక్ సభ నుండి గొడ్డేటి మాధవి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న అందరు ఎంపీల కంటే పేదది. 2019 ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ కేవలం రూ.1.4 లక్షలుగా పేర్కొన్నారు. 

చంద్రాని ముర్ము : ఒడిషాకు చెందిన చంద్రాని ముర్ము కోయెంజర్ ఎంపీ. బిజెడి పార్టీ నుండి పోటీచేసిన ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.3.4 లక్షలు మాత్రమే. ఈ యువ గ్రాడ్యుయేట్ రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనంత్ నాయక్ ను 2019 ఎన్నికల్లో ఓడించారు. 

సాద్వి ప్రగ్యా ఠాకూర్ : మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ నుండి 2019 ఎన్నికల్లో బిజెపి తరపున పోటీచేసి గెలిచారు ప్రగ్యా ఠాకూర్. అప్పుడు ఆమె ఆస్తుల విలువ రూ.4.4 లక్షలుగా చూపించారు. 
 
click me!