
Karaikudi Mani: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మృతాంగ విద్వాన్ కారైకుడిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలతో చైనాలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 3 సంవత్సరాల వయస్సులో కర్ణాటక సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన కారైకుడి మణి .. ఎన్నో గౌవర పురాస్కారాలను పొందారు. ఆయన దేశ సాంస్కృతిక రాయబారిగా నిలిచారు.
కరైకుడి శ్రీ రంగు అయ్యంగార్, శ్రీ డిఆర్ హరిహర శర్మ , శ్రీ కెఎమ్ వైద్యనాథన్‌ల శిష్యుడు. గురు కరైకుడి మణి 1963లో కేవలం 18 సంవత్సరాల వయస్సులో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ నుండి తన తొలిసారి జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. 1998లో ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఎన్నో ప్రపంచ వేదికపైకి ఆయన మృతాంగ ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశ సాంస్కృతి, సంప్రాదాయాలను చాటి చెప్పారు. MS సుబ్బులక్ష్మి, DK పట్టమ్మాళ్, ML వసంతకుమారి, మదురై సోము, TM త్యాగరాజన్, DK జయరామన్ , లాల్గుడి జయరామన్‌తో పాటు ఎంతో మంది కళకారులతో కలిసి పనిచేశారు.
అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. శృతిలయ పెర్కషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆయనే. అలాగే. శృతి లయ సేవా ట్రస్ట్ పేరిట ఎన్నో సేవ కార్యక్రమాలను చేశారు. అలాగే.. 'శ్రుతి లయ కేంద్రం' అనే సంగీత పాఠశాలను ప్రారంభించి ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో కర్ణాటక సంగీతాన్ని బోధిస్తూ వస్తున్నారు.