ఫణి తుఫాను.. మరికొన్ని గంటల్లో ఏపీ, తమిళనాడుకి ముప్పు

By telugu teamFirst Published Apr 26, 2019, 4:18 PM IST
Highlights

హిందూ మహాసముద్రం-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారిన అల్ప పీడనం మరికొన్ని గంటల్లో తుఫానుగా మారనుంది.

హిందూ మహాసముద్రం-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారిన అల్ప పీడనం మరికొన్ని గంటల్లో తుఫానుగా మారనుంది. దీనికి ఫణి అనే నామకరం చేయనున్నట్లు సమాచారం.

ట్రంకోమలి(శ్రీలంక) కు తూర్పు ఆగ్నేయదిశగా 1,140కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకు ఆగ్నేయంగా 1,490కిలోమీటర్ల మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా 1,760కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కదులుతోంది. మరో 24గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి.. మరో 12గంటల్లో తుపాను గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఈ తుపాను ఈ నెల 30వ తేదీ లేదా వచ్చే నెల 1వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. తీరం తాకిన తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో 29న తమిళనాడు తీరం, పుదుచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈనెల 29, 30 తేదీల్లో కేరళ, దక్షిణాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

click me!