చంపుతామంటూ గౌతమ్ గంభీర్ కు ఫోన్ కాల్, నెంబర్ ఇదే...

Published : Dec 23, 2019, 07:53 AM IST
చంపుతామంటూ గౌతమ్ గంభీర్ కు ఫోన్ కాల్, నెంబర్ ఇదే...

సారాంశం

తనను చంపుతామంటూ ఓ వ్యక్తి అంతర్జాతీయ కాల్ లో బెదిరించాడని బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశారు. తనకు కాల్ చెసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ను ఆయన పోలీసులకు ఇచ్చారు.

న్యూఢిల్లీ: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని బిజెపి పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబారనికి రక్షణ కల్పించాలని ఆనయ పోలీసులను కోరారు.

ఓ అంతర్జాతీయ నెంబర్ నుంచి రెండు రోజుల క్రితం కిందటన తనకు బెదిరింపు కాల్ వచ్ిచందని గంభీర్ డీసీపీ షహదారాకు రాసిన లేఖలో తెలిపారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని ఆ కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడని ఆయన చెప్పారు. 

తనకు వచ్చిన కాల్ కు సంబంధించిన నెంబర్ ను ఆయన పోలీసులకు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గంభీర్ బిజెపిలో చేరి ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పౌరసత్వ చట్టానికి ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నారు.

ఈ నెల 20వ తేదీన ఆయన డీసీపీకి లేఖ రాశారు. తనకు కాల్ వచ్చిన నెంబర్ +7(400)043 అని గంభీర్ చెప్పారు. తన వ్యక్తిగత కార్యదర్సి గౌరవ్ అరోరా పోలీసులకు తెలియజేసినట్లు గంభీర్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్