RBI Monetary Policy: క్రెడిట్ కార్డు, మ్యూచువల్ ఫండ్ చెల్లింపుల్లో కీల‌క మార్పులు.. ఆర్బీఐ సూచ‌న‌లు ఇవే

By Mahesh Rajamoni  |  First Published Dec 8, 2023, 3:21 PM IST

UPI transactions: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ లావాదేవీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు, క్రెడిట్ కార్డ్ లోన్ రీపేమెంట్‌లకు ఒక ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఓటీపీ ఆధారిత ఆథరైజేషన్ అవసరం లేదని తెలిపింది.
 


RBI Monetary Policy: రెపో రేటు, ద్రవ్యోల్బణ అంచనా, జీడీపీ వృద్ధి అంచనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ రెండు రోజుల సమావేశం ఫలితాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు. ఈ క్ర‌మంలోనే డిజిటల్ చెల్లింపుల్లో కొన్ని కీలక మార్పులను ప్ర‌క‌టించారు. రికరింగ్‌ చెల్లింపుల ఈ-మ్యాండేట్‌ పరిమితిని రూ. 15,000  నుంచి రూ. 1లక్షకు పెంచారు.

భారతదేశంలో చాలా సేవలు ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల సేవలను కలిగి ఉన్నప్పటికీ, ప్రతి నెలా లేదా త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షికంగా చెల్లించాల్సిన రీపేమెంట్స్ కోసం డిజిటల్ సేవ కూడా ఉంది. గతంలో ప్రజల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పేమెంట్ కంపెనీలు తమ బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలను జరిపేవి. అంటే రీపేమెంట్స్ ను స్వీకరించేవి. దీనిని నియంత్రించడానికి అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎఎఫ్ఎ) లేకుండా పునరావృత చెల్లింపు (రీపేమెంట్స్) చేయకూడదని ఆర్బిఐ ప్రకటించింది. ఇందుకోసం ఆర్బీఐ రూ.15,000 బెంచ్మార్క్ ను కూడా తీసుకొచ్చింది.

Latest Videos

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపుల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

 

దీనిలో భాగంగా రూ.15,000 కంటే ఎక్కువ ఆటో రికరింగ్ పేమెంట్ సర్వీస్ వినియోగదారుల నుంచి డబ్బును డెబిట్ చేయడానికి ఓటీపీ ద్వారా అనుమతి పొందడం తప్పనిసరి చేస్తూ గత ఏడాది ఒక ఫ్రేమ్వర్క్ ను ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుత ఆర్బీఐ నోటిఫికేషన్లో రూ .15,000 పరిమితిని కొన్ని ముఖ్యమైన సేవలకు మాత్రమే రూ .1 లక్ష వరకు పొడిగించారు. అంటే ఇప్పుడు ఒక ల‌క్ష‌రూపాయ‌ల వ‌ర‌కు కూడా చెల్లింపులు చేయడానికి ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ అవసరం లేదు.

మ్యూచువల్ ఫండ్ సబ్ స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్లు, క్రెడిట్ కార్డు రుణాల రీపేమెంట్ కు మాత్రమే ఈ కొత్త పరిమితి వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే యూపీఐ ద్వారా ఆటో చెల్లింపులు చేసేటప్పుడు చెల్లింపు మొత్తం రూ.15,000 దాటితే ఓటీపీ ఆధారిత ముందస్తు అనుమతి తప్పనిసరి అని వివరించింది. ఆర్బీఐ అదనపు క్లియరెన్స్ (ఏఎఫ్ఏ) అమలు చేసిన తర్వాత నెలకు రూ.8.5 కోట్ల టర్నోవర్ కింద రూ.2,800 కోట్ల బదిలీ జరుగుతోంది. దీంతో ఆర్బీఐ 2022 జూన్ నుంచి అధిక మొత్తంతో రికరింగ్ డిపాజిట్ వ్యవస్థను నియంత్రించింది. ప్రస్తుతం ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్ సబ్ స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్లు, క్రెడిట్ కార్డ్ లోన్ రీపేమెంట్ అనే మూడు చెల్లింపుల పరిమితిని రూ.1,500 నుంచి రూ.లక్షకు పెంచింది.

400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది శుభ్‌మన్ గిల్ నే.. బ్రియాన్ లారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

click me!