బస్సులో ప్రేమ: షాకిచ్చిన తల్లిదండ్రులు, ప్రియుడిలా...

Published : Aug 13, 2018, 03:18 PM ISTUpdated : Sep 09, 2018, 01:01 PM IST
బస్సులో ప్రేమ: షాకిచ్చిన తల్లిదండ్రులు, ప్రియుడిలా...

సారాంశం

తాను ప్రేమించిన యువతికి  మరో యువకుడితో వివాహం చేయాలని కుటుంబసభ్యుల నిర్ణయం తీసుకొన్నారు. దీంతో  ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ప్రియుడి ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలుసుకొన్న ఆ యువతి కూడ ఆత్మహత్యకు పాల్పడింది

చెన్నై: తాను ప్రేమించిన యువతికి  మరో యువకుడితో వివాహం చేయాలని కుటుంబసభ్యుల నిర్ణయం తీసుకొన్నారు. దీంతో  ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ప్రియుడి ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలుసుకొన్న ఆ యువతి కూడ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని  తిరునల్వేలి జిల్లాలో చోటు చేసుకొంది. 

తమిళనాడు రాష్ట్రంలోని  తిరునల్వేలి జిల్లా నాంగునేరిలో విషాదం చోటు చేసుకొంది.వయనన్ సామాజిక వర్గానికి చెందిన మహాలింగం కుమారుడు రత్నకుమార్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. 

మూలకరైపట్టి సమీపంలోని దైవనాయకం పేరికి చెందిన వెళ్లపాండి కుమార్తె సుధా డిగ్రీ చదువుతోంది. వీరిద్దరూ ప్రతి రోజూ  ఒకే బస్సులో కాలేజీకి వెళ్లేవారు. కాలేజీకి వెళ్లే సమయంలో  వీరిద్దరూ కూడ  బస్సులో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

వీరిద్దరూ కూడ  పెళ్లి చేసుకోవాలని భావించారు.  అయితే  వీరిద్దరి కులాలు వేరు కావడంతో  వీరి పెళ్లికి  పెద్దలు అంగీకరించలేదు. అమ్మాయి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో సుధాకు  వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.  ఈ విషయం తెలిసిన  వెంటనే ప్రియుడు రత్నకుమార్  శుక్రవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

ఈ విషయం ప్రియురాలు  సుధాకు తెలిసింది. ప్రియుడు ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన  సుధా రత్నకుమార్ అంత్యక్రియల్లో పాల్గొంది. రత్నకుమార్ బంధువులు ఆమెను ఒదార్చి ఇంటికి పంపించారు.


 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?