Ratan Tata: టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, టాటా ఆరోగ్యంపై ఇంకా అధికారిక అప్డేట్ ఇవ్వలేదు.
Ratan Tata: భారత టెక్, వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ సంస్థ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌లో టాటా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 86 ఏళ్ల రతన్ టాటా.. ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సోమవారం తెలిపారు.
కాగా, బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇవ్వాలని కోరినా టాటా ప్రతినిధి వెంటనే స్పందించలేదు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో టాటా ప్రచురించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
రతన్ టాటా 1937లో జన్మించారు. టాటా గ్రూప్ సంస్థల్లోని ఆటోస్ టు స్టీల్ సమ్మేళనానికి 1991లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వందేళ్ల క్రితం తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూపును 2012 వరకు నడిపారు.
టెలీ సర్వీసెస్ కంపెనీ తా టెలిసర్వీసెస్ (టీటీఎంఎల్)ను 1996లో స్థాపించారు. ఆ తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీగా ఎదిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించారు.