రామోజీరావు ఇక ఈనాడు సంపాదకుడు కాదు... వ్యవస్థాపకుడు మాత్రమే!

By telugu teamFirst Published Dec 14, 2019, 12:39 PM IST
Highlights

ఈనాడు అంటే రామోజీరావు...  రామోజీరావు అంటే ఈనాడు అనేంతగా విడదీయలేని బంధం ఏర్పడింది. ఆది నుంచి ఆ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న రామోజీరావు సంపాదకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. పత్రిక యజమానులు, సంపాదకుల పేర్లను తెలియజేస్తూ పత్రిక ఆఖరు పేజీలో అడుగు భాగాన ఉండే ‘ఇంప్రింట్’ లో రామోజీరావు పేరు ఎడిటర్ హోదాలో మనకు కనిపించేది. 46 ఏళ్ల సుదీర్ఘమైన సంపాదకత్వ అనుబంధం నుంచి రామోజీరావు పక్కకు తప్పుకున్నారు. 

రామోజీ రావు ఈ పేరు అంటే ప్రియా పచ్చళ్ళనుండి మొదలు మార్గదర్శి చిట్ ఫండ్స్ వరకు అనేక సంస్థలు మనకు గుర్తుకు వచ్చినా... ప్రతినిత్యం తెలుగువారు చదివే ఈనాడు పత్రిక సంపాదకుడిగానే అధికమంది కళ్ళముందు మెదులుతారు. 

రామోజీరావు ను తెలుగు మీడియా మొగల్ గా అందరూ పేర్కొంటారు. ఆరోజుల్లో దినపత్రికల తీరుతెన్నులను సమూలంగా మార్చేసి ఒక విప్లవాత్మకమైన పద్దతిలో ఆయన ఈనాడును ప్రారంభించారు అలానే నడిపించారు. 

జర్నలిజంలో నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ ముందుకు దూసుకెళ్లింది. అప్పటిదాకా ఉన్న మూస పద్ధతులను తోసిరాజేసి ఈనాడు తెరపైకి నయా ట్రాండ్స్ ని తీసుకువచ్చింది. అలా తీసుకువచ్చిన ఒక కొత్త పోకడనే, యజమానే స్వయంగా సంపాదకుడిగా ఉండడం. 

ఈనాడు అంటే రామోజీరావు...  రామోజీరావు అంటే ఈనాడు అనేంతగా విడదీయలేని బంధం ఏర్పడింది. ఆది నుంచి ఆ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న రామోజీరావు సంపాదకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. 

 పత్రిక యజమానులు, సంపాదకుల పేర్లను తెలియజేస్తూ పత్రిక ఆఖరు పేజీలో అడుగు భాగాన ఉండే ‘ఇంప్రింట్’ లో రామోజీరావు పేరు ఎడిటర్ హోదాలో మనకు కనిపించేది. 46 ఏళ్ల సుదీర్ఘమైన సంపాదకత్వ అనుబంధం నుంచి రామోజీరావు పక్కకు తప్పుకున్నారు. 

నేడు 14 డిసెంబరు 2019 శనివారం నుంచి ఈనాడు ‘ఇంప్రింట్’లో ఆయన పేరు కేవలం ‘ఫౌండర్’గా మాత్రమే మనకు కనపడనుంది. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న ఎడిటర్ హోదాలోకి  కొత్తగా సంపాదకులు వచ్చారు. 

ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లకు వేర్వేరుగా ఎడిటర్లను నియమించింది. సంస్థలో ఇప్పటికే చాలా సీనియర్లుగా సేవలందిస్తున్న డి.ఎన్.ప్రసాద్ తెలంగాణ ఎడిషన్‌కు ఎడిటర్ గా వ్యవహరించనుండగా,  మానుకొండ నాగేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు ఎడిటర్లుగా పేర్కొంటూ నేటి ఇంప్రింట్ లో ముద్రించబడింది. 

click me!