ఏనుగుపై కూర్చొని యోగా.. కిందపడిపోయిన రాందేవ్ బాబా

By telugu news teamFirst Published Oct 14, 2020, 4:07 PM IST
Highlights

చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.

యోగా గురువు, పతంజలి ఆయుర్వేదిక్ సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ ప్రస్తుతం ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయన ఏనుగుపై కూర్చొని యోగా చేస్తూ.. కిందపడిపోయారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు కొందరు అయ్యో పాపం అని అంటుండగా.. కొందరు మాత్రం ఫన్నీ మీమ్స్ ట్రోల్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాబా రాందేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్ లో యోగా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబాగారు బింకంగా అవేమీ పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే లేచి సర్దుకున్నరాందేవ్ అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. 

అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర విచిత్ర భంగిమలు, ఫోజులతో గతంలో వార్తల్లో నిలిచిన రాందేవ్ తాజాగా ఏనుగుమీద యోగాతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. అంతేకాదు గతంలో సైకిల్ తొక్కుతూ రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇపుడు విపరీతంగా షేర్ అవుతోంది. 

click me!