
Ramdev Baba:ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు: యోగా గురు రామ్ దేవ్ బాబా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ముస్లింలు, క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాంలీలా మైదాన్‌లోని సద్భావనా సమ్మేళనంలో అల్లా, ఓం ఒక్కటే అని చెప్పడంపై ప్రారంభమైన వివాదంపై యోగా గురు బాబా రామ్‌దేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లిం మత గురువుకు సవాల్ విసిరి.. మీరు అందరూ ఇస్లాం నుంచి పుట్టారని చెప్పినా మేం అంగీకరించబోమన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మత, సైద్ధాంతిక భీభత్సం, ఉన్మాదానికి జాతీయవాదం, ఆధ్యాత్మికతలే పరిష్కారమని అన్నారు.
రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు, రేపిస్ట్‌లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు (ముస్లింలు) తప్పనిసరిగా ఉదయం ప్రార్థనలు చేస్తారు. ఇలా.. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంటే.. ఆ తరవాత ఏమైనా చేసుకోవచ్చు. ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలా మంది ముస్లింలు ఇలానే చేస్తారు. కానీ నమాజ్‌ను చేస్తారు. టెర్రరిస్ట్‌లు, క్రిమినల్స్ లా కనిపిస్తారనీ, వాళ్లు నమాజ్‌తో ఆ తప్పులను కవర్ చేస్తారు. ఇస్లాం అంటే నమాజ్ చేయడమేననీ, కానీ కానీ హిందూ మతం అలా కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా.. ఏదో క వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలు తప్పా ఒప్పా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలని అన్నారు.
గతంలో బాబా రాందేవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే..మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. వారు సల్వార్‌లోనూ అందంగా కనిపిస్తారు. నా కళ్లకు… ఏం వేసుకోకపోయినా అందంగానే ఉంటారని సంచలన ప్రకటన చేశారు. దీంతో రామ్‌దేవ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మహిళ సంఘాలు కూడా క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.