మణిపూర్ మహిళలకు ప్రధాని మోడీ రక్షాబంధన్ కానుక

Siva Kodati |  
Published : Jul 23, 2020, 03:39 PM IST
మణిపూర్ మహిళలకు ప్రధాని మోడీ రక్షాబంధన్ కానుక

సారాంశం

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశం ముందుకు సాగడం నిలిచిపోకూడదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోడీ.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశం ముందుకు సాగడం నిలిచిపోకూడదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. మణిపూర్‌ ప్రజల కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడి మహిళలకు తానిస్తున్న రక్షాబంధన్ కానుకగా దీనిని అభివర్ణించారు. అభివృద్ధి పనులకు కరోనా వైరస్ అడ్డంకి కాకూడదని ఆయన పేర్కొన్నారు.

ఇంఫాల్ మహానగరం, మణిపూర్‌లోని  1700 గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తుందని ప్రధాని తెలిపారు. అక్కడి ప్రజలకు ఇది జీవన రేఖగా మారుతుందని.. రాష్ట్రంలోని మహిళలు, లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందని మోడీ ఆకాంక్షించారు.

స్థానిక పంచాయతీలు, ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించిందని.. వికేంద్రీకరణకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ప్రధాని అభివర్ణించారు. ఈ నీటి ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి దొరుకుతుందని మోడీ అన్నారు.

ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు కరోనా మహమ్మారి, వరదతో కష్టాలు పడుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చెందారు. వరదల కారణంగా చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. ఈ కష్టకాలంలో వారందరికీ అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?