భార్యపై అనుమానం.. గొలుసులతో కట్టేసి..!

Published : Jul 01, 2021, 12:16 PM IST
భార్యపై అనుమానం.. గొలుసులతో కట్టేసి..!

సారాంశం

లాల్ ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు

భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందేమేనని అతనికి అనుమానం. ఈ అనుమానంతోనే ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాడు. తాజాగా.. తాను బయటకు వెళితే.. ఎవరితోనైనా వెళ్లిపోతుందేమేననే భయంతో ఏకంగా ఆమెను ఇనుప గొలుసులతో కట్టేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భర్త తన భార్యను ఇంట్లోనే 30 కిలోల బరువున్న ఇనుప గొలుసుతో మూడు నెలలపాటు బంధించి, వేధించాడు. లాల్ ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి బాధిత మహిళను గొలుసును తెంపి కాపాడారు.

 వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు తాను పుట్టింటికి వస్తే భర్త వచ్చి తనను దారుణంగా కొట్టి, ఇంటికి తీసుకువచ్చి ఇనుపగొలుసులతో బంధించి రెండు తాళాలు వేసి వెళ్లాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తన తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు వస్తే తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి తన భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను కాపాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడైన భర్తను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..