భార్యకు దూరం, మరో మహిళతో కాపురం: ఐపీఎస్‌కు షాక్

Published : Mar 07, 2019, 01:03 PM IST
భార్యకు దూరం, మరో మహిళతో కాపురం: ఐపీఎస్‌కు షాక్

సారాంశం

భార్యకు విడాకులు ఇవ్వకుండానే  మరో మహిళతో సహజీవనం చేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిస్మిస్ చేసింది.  

జైపూర్: భార్యకు విడాకులు ఇవ్వకుండానే  మరో మహిళతో సహజీవనం చేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిస్మిస్ చేసింది.

రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే  మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. పంకజ్ కుమార్ 2009 బ్యాచ్ కు చెందిన  సుధాగుప్తాను  2005 డిసెంబర్ 4వ తేదీన  పెళ్లి చేసుకొన్నాడు. 

అయితే వీరిద్దరూ కూడ 2018 మే 5 తేదీన విడాకులు తీసుకొన్నారు.  వీరిద్దరూ విడాకులు తీసుకోకముందే  పంకజ్ కుమార్ మరో మహిళతో సహజీవనం చేశాడు. ఆ మహిళ ద్వారా బిడ్డకు తండ్రయ్యాడు.  భార్యకు విడాకులు ఇవ్వకుండానే  మరో మహిళతో సహజీవనం చేయడం ఆలిండియా సర్వీస్ నిబంధనలకు విరుద్దం.

ఈ కారణాన్ని చూపుతూ కేంద్రం పంకజ్‌ను  డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకొంది. కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించనున్నట్టు పంకజ్ ప్రకటించారు.పంకజ్  పలుమార్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu