ఒకే అమ్మాయితో ఇద్దరి ప్రేమ.. చేతిపై పచ్చబొట్టు.. చివరకు..

Published : Mar 09, 2021, 10:53 AM ISTUpdated : Mar 09, 2021, 11:36 AM IST
ఒకే అమ్మాయితో ఇద్దరి ప్రేమ.. చేతిపై పచ్చబొట్టు.. చివరకు..

సారాంశం

ఆలస్యంగా వారికి ఈ విషయం తెలిసింది. తామిద్దరం ఒకరినే ప్రేమించామని. ఈ విషయం తెలిశాక ఇద్దరూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

వారిద్దరూ బంధువులు అవుతారు. ఒకరికి తెలీకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఆమె పేరుని తమ చేతుల మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. 

ఆలస్యంగా వారికి ఈ విషయం తెలిసింది. తామిద్దరం ఒకరినే ప్రేమించామని. ఈ విషయం తెలిశాక ఇద్దరూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రం బుండి జిల్లా కేవవపురా గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్ (23),దేవరాజ్ గుర్జర్ (23)లు బంధువులు. వీరిద్దరూ ఆశా అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నారు. వారు తమ చేతుల మీద ఆశా అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. 

ఇద్దరు యువకులు గుడ్లా గ్రామానికి సమీపంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  కాగా.. చనిపోవడానికి ముందు వీరు ఎందుకు చనిపోతున్నామో వీడియో తీసి.. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం.  రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్