Rajasthan : రాజ‌స్థాన్ లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్య‌క్తి అత్యాచారం.

Published : Feb 26, 2022, 10:41 PM IST
Rajasthan : రాజ‌స్థాన్ లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్య‌క్తి అత్యాచారం.

సారాంశం

రాజస్థాన్ లోని భిల్వారాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ 40 ఏళ్ల వ్యక్తి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన విషయంతో తెలియడంతో స్థానికులు నిందితుడిని తీవ్రంగా చితకబాదారు.

చిన్నారుల‌పై, మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌ను అరిక‌ట్టేందుకు ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. వారిపై నేరాలు ఆగ‌డం లేదు. త‌ర‌చూ ఎక్క‌డో ఒక చోట ఇలాంటి ఘ‌ట‌న వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లోనూ ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. అభ‌శుభం తెలియ‌న ఓ చిన్నారిపై ఓ మాన‌వ మృగం కామ‌వాంఛ‌తో దారుణానికి ఒడిగ‌ట్టింది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ (Rajasthan)లోని భిల్వారా (Bhilwara) జిల్లాలో 3 ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు భిల్వారాలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బాధిత ఆ చిన్నారి నిందితుడిని ‘‘మామ’’ అని పిలిచేది. అయినప్పటికీ అతడు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ అత్యాచారం విష‌యం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని తీవ్రంగా చిత‌క‌బాదారు. అనంత‌రం అత‌డిని పోలీసులకు అప్ప‌గించారు. ఆ నిందితుడిపై స్థానికులు తీవ్రంగా దాడి చేయ‌డంతో అత‌డికి గాయాలు అయ్యాయి. నిందితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఎంజీఎం హాస్పిట‌ల్ లో జాయిన్ చేశారు. కాగా ప్ర‌స్తుతం బాలిక ప్రాణాపాయం నుంచి బ‌య‌ప‌డిన‌ట్టు స‌మాచారం. 

త‌మిళ‌నాడులో మ‌రో ఘ‌ట‌న‌.. 
శ‌నివారం మ‌ధ్యాహ్నం త‌మిళ‌నాడు (tamilnadu )లోనూ ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగు చూసింది. తమిళనాడులోని తిరుచ్చి (tirucchi)లో  మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఈ ధారుణానికి ఒడిగ‌ట్టాడు. చిన్నారి తీవ్రంగా ఏడ‌వ‌డంతో చుట్టు పక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధిత తల్లి పోలీసులను ఆశ్ర‌యించింది.  తమిళనాడులోని తిరుచ్చి జిల్లా ఒలైయూర్ (oliyur) గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. అయితే పని నిమిత్తం ఇంట్లో పాప‌ను ఇంట్లో ఒంట‌రిగా విడిచి వెళ్లారు. ఇదే అదునుగా భావించి ఆ చిన్నారిని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుక‌వెళ్లి ఆమె పై యువ‌కుడు లైంగిక దాడికి పాల్ప‌డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

గ‌తేడాది యూపీలో మూడు నెల‌ల చిన్నారిపై.. 
చిన్నారుల‌పై ఇలాంటి దాడులు ప్ర‌తీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021 ఆగ‌స్టు నెల‌లో యూపీలోని ఎటాహ్ జిల్లాలోని బాగ్వాలా పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  చిన్నారి తల్లి గేదెలు కట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో త‌ల్లి లేక‌పోవ‌డంతో అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో ఏడుస్తున్న బాలిక‌ను అత‌డు శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పాప ఎందుకు ఏడుస్తోంద‌ని త‌ల్లి ప్ర‌శ్నించ‌గా.. మ‌ల మూత్ర విస‌ర్జ‌న చేసింద‌ని తెలిపాడు. కానీ అత‌డు వెళ్లిపోయాక చిన్నారి ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అవుతున్నట్లు తల్లి గుర్తించింది. బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు గుర్తించింది. పసికందును చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌