కరోనా కల్లోలం: రైల్వే వ్యాగన్లతో ఆక్సిజన్ సరఫరా

By narsimha lodeFirst Published Apr 19, 2021, 5:55 PM IST
Highlights

దేశంలో వివిధ ఆసుపత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను నివారించేందుకు  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుండి రైల్వే శాఖ  నడుపుతుంది.

న్యూఢిల్లీ: దేశంలో వివిధ ఆసుపత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను నివారించేందుకు  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుండి రైల్వే శాఖ  నడుపుతుంది.కరోనా వైరస్ కేసులు దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో  పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొంది.  దీంతో  ఆక్సిజన్ కొరతను నివారించేందుకు  కేంద్రం నడుంబిగించింది.

ఆర్మీ సహకారంతో దేశంలోని పలు ప్రాంతాలకు 32 వ్యాగన్లలో ఆక్సిజన్ ట్రక్కులను రైల్వేశాఖ పంపతుంది.  మహారాస్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ రైల్వే యార్డ్ నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది.సోమవారం నాడు ఉదయం సెంట్రల్ రైల్వేలోని కలంబోలి రైల్వేయార్డు వద్ద ఖాళీ ట్యాంకర్లను లోడ్ చేస్తున్నారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలోని స్టీల్ ప్లాంట్ కు వెళ్తుంది.  ఇక్కడ ఆక్సిజన్ ను ట్యాంకర్లలో నింపుకొని తిరిగి నవీ ముంబైలోని కలంబోలికి తీసుకు వస్తారు.

దేశంలో నాలుగు రోజులుగా కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. రెండులక్షలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. దీంతో ఆయా రాష్రాలు కూడ అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. 


 

click me!