సోనూసూద్ : అభిమాని చేసిన పనికి షాక్ అయిన రియల్ హీరో.. అలా చేయద్దంటూ హితవు...

Published : Sep 10, 2022, 01:54 PM IST
సోనూసూద్ : అభిమాని చేసిన పనికి షాక్ అయిన రియల్ హీరో.. అలా చేయద్దంటూ హితవు...

సారాంశం

సోనూసూద్ కు ఓ అభిమాని రక్తంతో పెయింటింగ్ వేసి.. బహుమతిగా ఇచ్చాడు. అలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. కానీ సోనూసూద్ డిఫరెంట్ గా స్పందించాడు. 

ముంబై : సోను సూద్…  సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తూ..  నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరో గా నిలిచిన నటుడు సోనూసూద్.  కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి ఆపద్బాంధవుడిగా ఆదుకున్నారు.  నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోను సూదికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.  తాజాగా  మధు  గుర్జార్  అనే ఫ్యాన్ సోనూసూద్ పై తన అభిమానాన్ని  ప్రత్యేక రీతిలో చాటుకున్నాడు.

తన రక్తంతో సోనుసూద్ పెయింటింగ్ వేసి..  ఆ పెయింటింగ్ను ఆయనకే బహుమతిగా ఇచ్చాడు.  అభిమాని చేసిన పనికి  రియల్ హీరో షాక్ అయ్యాడు. రక్తంతో తన బొమ్మను గీయడం కంటే..  తన పేరు చెప్పి రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని సోనూసూద్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సోనుసూద్ ట్విట్టర్లో షేర్ చేస్తూ..  వృధా చేయకుండా దానం చేయాలని కోరారు.  ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా చాంద్ గా బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు.  ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.
 

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM