భర్తపై మహిళా పోలీస్ హత్యాయత్నం...సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు

By Arun Kumar PFirst Published Mar 12, 2019, 7:03 PM IST
Highlights

ఆమె రైల్వే శాఖలో పోలీస్ అధికారిణి. అదే రైల్వే శాఖలో పనిచేసే ఓ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే విధుల్లో భాగంగా ఇద్దరూ వేరువేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఇలా వేరుగా వెంటున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం అతడి నుండి అవమానకరమైన మాటలు, దూషణలు, వేధింపులను ఆమె ఎదుర్కొంటున్నా మౌనంగా భరించేది. అయితే తోటి సిబ్బంది ముందు తన క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడటాన్ని తట్టుకోలేక పోయిన ఆమె భర్త అని కూడా చూడకుండా అతడిపై కాల్పులను దిగింది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  రైల్వే భద్రతా దళంలో ఇన్స్‌పెక్టర్ గా విధులు నిర్వర్తించే సునితా మింజ్, అదే శాఖలో పనిచేసే శ్రీవాత్సవ భార్యాభర్తలు. అయితే విధుల్లో భాగంగా వేరుగా వుంటున్న భార్య సునీతకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందంటూ భర్త నిత్యం అనుమానించేవాడు. ఈ కారణంగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఈ క్రమంలో అతడికి భార్యపై అనుమానం రోజురోజుకు పెరిగి ఆమె పనిచేసే స్టేషన్ కు వెళ్లి గొడవకు దిగే వరకు వెళ్లింది. ఈ విధంగానే గత ఆదివారం భార్య పనిచేసే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అతడు తోటి సిబ్బంది ముందే ఆమెను అసభ్యకరంగా దూషించడం ప్రారంభించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయిన ఆమె అతడికి తీవ్రంగా హెచ్చరించింది. అయినా అతడు వినకపోవడంతో తన సర్వీస్ రివాల్వర్ తో అతడిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. 

బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో శ్రీవాస్తవ రక్తపుమడుగులో పడిపోగా అతడిని రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కాల్పులకు తెగబడ్డ సర్వీస్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని సునీతను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   
 
click me!