కేరళ వరదలపై మోదీకి రాహుల్ ట్వీట్

By sivanagaprasad KodatiFirst Published Aug 16, 2018, 5:31 PM IST
Highlights

 కేరళలో వరద భీభత్సంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. కేరళ ప్రజలకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ట్వీట్ చేశారు. 
 

ఢిల్లీ:  కేరళలో వరద భీభత్సంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. కేరళ ప్రజలకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ట్వీట్ చేశారు. 

కేరళ తీవ్ర సమస్యల్లో ఉంది. ఆర్మీ, నేవీ సిబ్బందిని మరింత పెంచి సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని కేంద్రాన్ని కోరుతున్నాను. కేరళ తన పూర్వరూపు కోల్పోయే దశకు చేరుకుంది. ప్రకృతి అందాలకు నెలవైన కేరళకు పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇందులో ఎలాంటి పక్షపాతం చూపొద్దంటూ కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

 కేరళ ప్రజల పట్ల నేనెంతో బాధ పడుతున్నారు. ఈ రోజు రాత్రి వారికెలా గడుస్తుందోనని ఆందోళన పడుతున్నాను. కేరళ వాసులు రాత్రిళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. వేలమంది వీధిన పడ్డారు. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. 

అందులో వారి కుటుంబ పెద్దలు కూడా ఉండవచ్చు. కాబట్టి అందరికీ మీ సామర్థ్యం మేరకు సాయం చేయండి. అందరం కలిసి కేరళ ప్రజలను ఆదుకుందాం రండి. మీమీ విరాళాలను సీఎం సహాయనిధికి పంపండి అని పిలుపునిస్తూ మరో ట్వీట్ చేశారు. 

click me!