టీవీ నటి వైశాలీ ఠక్కర్ ఆత్మహత్య కేసులో రాహుల్ నవలానీ అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Oct 21, 2022, 8:42 AM IST
Highlights

బుల్లితెర నటి వైశాలీ ఠక్కర్ ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన పక్కింటి వ్యక్తి రాహుల్ నవలానీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇండోర్ : ప్రముఖ టీవీ నటి వైశాలీ ఠక్కర్(29) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన రాహుల్ నవలానీని ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్ర గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడి ఫోను, ఇతర ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వైశాలీ నివాసం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 5 పేజీల సూసైడ్ నోట్ లో.. పొరుగింట్లో ఉంటున్న రాహుల్ నవలానీ, దిశ దంపతులు తనను వేధించిన విషయాన్ని ఆమె పేర్కొంది. దిశా పరారీలో ఉంది. వైశాలి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసినప్పటి నుంచి రాహుల్ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడికి బెయిల్ పిటిషన్ ను ఇండోర్ న్యాయస్థానం తిరస్కరించింది.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 16న ప్రముఖ బుల్లితెర నటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు, ససురాల్ సిమర్ కా టీవీ షో ఫేం వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో సాయిబాగ్ లోని తన ఇంట్లో నటి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైశాలి ఆత్మహత్య వార్త ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించి ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, బుల్లితెర నటి వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య

ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఉన్న విషయంలో అప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు.  ఆత్మహత్యకు నోట్లో వైశాలి పేర్కొన్న కారణాలు ఏమిటని తెలియరాలేదు. అయితే ప్రాథమికంగా జరిగిన విచారణలో ఆమె ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తరువాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

వైశాలి ఉజ్జయినిలోని మహిద్ పూర్లో వైశాలి జన్మించింది. యే రిస్తా క్యా కెహలాతాహై  సీరియల్ తో కెరీర్ను ప్రారంభించింది. వైశాలి మానసిక వేదనకు గురి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆమె పక్కింట్లో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తి అంటున్నారు. ఈ మేరకు ఇండోర్ ఏసిపి రెహ్మాన్ కీలక విషయాలు వెల్లడించారు. వైశాలి మరణించిన తరువాత రోజు ఈ విషయం బయటపడింది.  వైశాలిని మానసికంగా వేధించడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

వైశాలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవడంతో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాడని.. అది ఆమెను అని తీవ్రంగా బాధించినట్లు తెలుస్తోంది. కెన్యాలో పనిచేసే ఒక సర్జన్తో వైశాలి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి రాహుల్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మానసిక వేదన భరించలేక, బయటికి చెప్పుకోలేక వైశాలి సూసైడ్ చేసుకున్న పోలీసులు వివరించారు.

click me!