ఆయన జమ్మూకాశ్మీర్ లో ఐఎస్ఐ భాష మాట్లాడుతున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్  

By Rajesh KarampooriFirst Published Jan 22, 2023, 12:02 AM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ "ఐఎస్ఐ భాష" మాట్లాడటం ద్వారా "జమ్మూ కాశ్మీర్ లో విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు.మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో రాహుల్ గాంధీ విసిగిపోయారని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ విభజన ఎజెండాను ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు రాహుల్ గాంధీ మనస్తాపం చెందారని, ఐఎస్ఐ భాష మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని చుగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదం నుంచి పర్యాటకంగా మారిందని రాహుల్‌ గాంధీ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ప్రజలు కొత్త జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రులుగా పరిపాలించిన ముఫ్తీలు,  అబ్దుల్లాల కుటుంబంపై తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. వారంతా జమ్మూకాశ్మీర్ లో విధ్వంసం సృష్టించాయనీ, ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద రాజధానిగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ ప్రజలకు కొత్త దార్శనికతను, ఆశలను కల్పించిందని చుగ్ అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి, శ్రేయస్సు అజెండాకు అనుకూలంగా తమ ఆదేశాన్ని ఇచ్చారని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని చుగ్ అన్నారు. 

రాహుల్ గాంధీ నాయకత్వం వహించిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో సాగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల (జనవరి) 30న జమ్మూ కాశ్మీర్‌లో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర తమిళనాడు,కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ , పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ పై సాగింది. చివరిగా..  జమ్మూ కశ్మీర్ చేరుకుంది. ఈ రాష్ట్రంలో పర్యటన అనంతరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ మేరకు దేశంలోని అన్ని పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి, బెంగాల్ సీఎ మమతా బెనర్జీ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్రీయ్ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్,  అఖిలేష్ యాదవ్ (సమాజ్‭వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. 

click me!