వాటి నుంచి దృష్టి మరల్చడానికే.. హింస, ద్వేషాలను సృష్టిస్తున్నారు..   బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు  

By Rajesh KarampooriFirst Published Sep 25, 2022, 1:52 AM IST
Highlights

దేశంలో రోజురోజుకు ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, ప్రజల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని భారతదేశంలోని కొంతమంది వ్యాపారవేత్తలకు ఇస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధనం, వంటగ్యాస్ ధరలపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకపడ్డారు. ఇలాంటి బర్నింగ్ సమస్యల నుండి ప్రజలను మరల్చడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లు దేశంలో ద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం కేరళలోని త్రిస్సూర్‌లోని ప్రఖ్యాత తేక్కింకాడు మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులు, యువత, మహిళల కోసం కాదని, తమకు నచ్చినది చేసే ఐదారుగురు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం నడుస్తోందని ఆరోపించారు.   గత 70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని అడుగుతున్నారని గాంధీ అన్నారు."నరేంద్ర మోడీ గారూ.. మీరు ఇచ్చిన నిరుద్యోగిత స్థాయిని మేము భారతదేశానికి ఎప్పుడూ ఇవ్వలేదు. మేము భారతదేశానికి ఎప్పుడూ నిత్యావసర వస్తువుల ధరలను  అత్యధిక స్థాయికి తీసుకవెళ్లలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ₹ 400. కానీ నేడు  గ్యాస్ సిలిండర్‌ ధర ₹ 1,000 పై మాటనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకు ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, ప్రజల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని భారతదేశంలోని కొంతమంది వ్యాపారవేత్తలకు ఇస్తున్నారని ఆరోపించారు. 

ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియనివ్వకుండా..దృష్టి మరల్చడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు దేశంలో హింస, ద్వేషాన్ని సష్టిస్తున్నాయని అన్నారు. ప్రధాని మోడీ నేతత్వంలోని ప్రభుత్వం భారతదేశ ప్రజల కోసం లేదా చిన్న,మధ్యతరహా వ్యాపారుల కోసం లేదా కార్మికులు లేదా రైతులు లేదా యువత కోసం అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు.భారతదేశంలో అత్యధిక పట్టణ నిరుద్యోగిత రేటు కేరళలో ఉందని, ఈ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. నిరుద్యోగ సమస్యపై  అధ్యయనం చేసి, విశ్లేషించాలని సీఎం పినరయిని
అభ్యర్థించారు.కేరళలోని యువకుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని అన్నారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ, ఉద్యోగాల కల్పన వ్యవస్థను ప్రభుత్వం క్షుణ్ణంగా విశ్లేషించాలని రాహుల్ గాంధీ సూచించారు. ఎక్కడ నుండి వచ్చినా తమ పార్టీ అన్ని రకాల మతతత్వాలపై పోరాడుతుందని, విభజన, ద్వేషం భారతదేశాన్ని బలహీనపరుస్తుందనీ, బలహీనమైన భారతదేశాన్ని తాము సహించమని అన్నారు. 

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. 150 రోజుల్లో 3,570 కి.మీ. పాదయాత్ర చేయాలనే సంకల్పంతో సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర  జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర కేరళలో సాగుతుంది. నేడుత్రిస్సూర్‌ సమీపంలోని పెరంబ్రా వరకు సాగింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి వందలాది మంది పార్టీ కార్యకర్తలు మార్చ్‌లో పాల్గొన్నారు. నేటి పాదయాత్ర కేరళలోని త్రిసూర్‌లోని తేక్కింకాడు మైదానంలో ముగిసింది. సెప్టెంబర్ 10 సాయంత్రం కేరళలో అడుగుపెట్టిన ఈ యాత్ర.. అక్టోబర్ 1న కర్ణాటకలోకి ప్రవేశించడానికి ముందు 19 రోజుల్లో ఏడు జిల్లాల్లో దాదాపు 450 కి.మీ.సాగనున్నది.
 

click me!