రాహుల్ గాంధీకి తప్పలేదు: చుక్కలు చూడాల్సిందేనా....

Published : Apr 06, 2019, 04:20 PM IST
రాహుల్ గాంధీకి తప్పలేదు: చుక్కలు చూడాల్సిందేనా....

సారాంశం

దీంతో రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీయే పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పేరు చివర కేఈ తప్ప ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి. అంతేకాదు రాహుల్ గాంధీ కేఈ నామినేసన్లో సరికొత్త అంశాలు కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీ కేఈకి ఓ సొదరుడు ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ గాంధీ కేఈ. 

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కేరళ రాష్ట్రంలోని వేనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీకి అదేపేరుతో ఉన్న అగిల ఇండియా మక్కల్ కజగమ్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కేఈ నామినేషన్ దాఖలు చేశారు. 

దీంతో రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీయే పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పేరు చివర కేఈ తప్ప ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి. అంతేకాదు రాహుల్ గాంధీ కేఈ నామినేసన్లో సరికొత్త అంశాలు కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీ కేఈకి ఓ సొదరుడు ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ గాంధీ కేఈ. 

రాహుల్ గాంధీ తండ్రి పేరు రాజీవ్ గాంధీ. అంతే కాకుండా రాజీవ్‌కు ఒక ఒక కూతురు ఉందని, ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని అని పెట్టారని రాహుల్ గాంధీ కేఈ నామినేషన్లు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంటుంది. రాహుల్ గాంధీ పేరుతో మరో నామినేషన్ ఉండటంతో ఓట్లు చీలిపోతాయేమోనని ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?