రైతులకు అవమానం: బడ్జెట్‌పై రాహుల్ వ్యాఖ్య

By narsimha lodeFirst Published Feb 1, 2019, 6:13 PM IST
Highlights

మోడీ ప్రభుత్వం రైతులను అవమానపర్చిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.
 

న్యూఢిల్లీ:మోడీ ప్రభుత్వం రైతులను అవమానపర్చిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.

శుక్రవారం నాడు ఢిల్లీలో సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ పేరుతో  న్యూఢిల్లీలోని  కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, డీఎంకె, టీజెఎస్ చీఫ్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. రైతులకు రోజుకు రూ.17 రూపాయాలు ఇవ్వడం వారిని అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు రాహుల్ ప్రకటించారు. సోమవారం నాడు ఈవీఎంలపై చోటు చేసుకొన్న అనుమానాలపై  ఈసీని  కలుస్తామన్నారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న 21 పార్టీల నేతలతో కలిసి ఈసీని  కలవనున్నట్టు చెప్పారు.ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్న విషయాన్ని ఆయన అభిప్రాయపడ్డారు.  నాలుగేళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆయన చెప్పారు. 

click me!