Lakhimpur Kheri: లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ నిరసన, ప్రియాంక విడుదల

Published : Oct 06, 2021, 03:24 PM ISTUpdated : Oct 06, 2021, 03:26 PM IST
Lakhimpur Kheri: లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ నిరసన, ప్రియాంక విడుదల

సారాంశం

లక్నో ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. తన స్వంత వాహనంలోనే లఖీంపూర్ కి వెళ్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఎస్కార్ట్‌తో వెళ్లేందుకు  ఆయన నిరాకరించారు.

లక్నో: యూపీ పోలీసుల తీరును నిరసిస్తూ లక్నో ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నాడు బైఠాయించారు. లఖీంపూర్ కి వెళ్లేందుకు పోలీసులు అనుమతించినట్టే ఇచ్చి కొర్రీలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

also read:Lakhimpur Kheri: రైతులపై పథకం ప్రకారం దాడి.. రాహుల్ ఫైర్

ఇటీవల ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కారుతో పాటు మరో కారు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది రైతులు మరణించారు.ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కారును కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు నడిపాడని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి కొట్టిపారేశారు.

lakhimpur kehri లో బాధిత రైతులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ ఛత్తీస్ ఘడ్ , పంజాబ్ సీఎంలతో కలిసి బుధవారం నాడు విమానంలో ఢిల్లీ నుండి లక్నోకు చేరుకొన్నారు.  

అయితే రాహుల్ గాంధీని స్వంత వాహనంలో  వెళ్లేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. ప్రభుత్వ ఎస్కార్ట్ తో లఖీంపూర్ వెళ్లేందుకు రాహుల్ గాంధీ నిరాకరించాడు.బాధిత రైతుల కుటుంబాలను  పరామర్శించేందుకు అనుమతించినట్టుగా ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని Rahul gandhi ఆరోపించారు.  తన స్వంత వాహనంలోనే లఖీంపూర్ వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ లక్నో ఎయిర్‌పోర్టు లాంజ్ లోనే రాహుల్ గాంధీ నిరసనకు దిగారు.  రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చున్నీ, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ ఉన్నారు.


ప్రియాంక గాంధీ విడుదల

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి priyanka gandhiనియూపీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఆమెను లఖీంపూర్ వెళ్లకుండా సీతాపూర్ గెస్ట్ హౌస్ లో ఉంచారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని ప్రియాంక గాంధీతో పాటు మరో 11 మంది కాంగ్రెస్ నేతలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన ప్రియాంక గాంధీని పోలీసులు బుధవారం నాడు విడుదల చేశారు. లఖీంపూర్ కు వెళ్లేందుకు పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకలకు అనుమతి ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?