
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని.. మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ తీరును ప్రస్తావిస్తూ యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఏపీ విభజనకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ వ్యాఖ్యలు తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్)లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’’ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో సోమవారం 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పార్లమెంట్‌లో భవనంతో ఉన్న అనుబంధం, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, మాజీ ప్రధానులు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రగతి శీల కార్యక్రమాల గురించి మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ తీరును ప్రస్తావిస్తూ యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదే పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదని మోదీ అన్నారు. విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారని మోదీ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదని అన్నారు. వాజ్‌పేయి హయంలో కూడా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు జరిగిందని.. అప్పుడు విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నాయని అన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని అన్నారు.