ఆత్మహత్య ఆలోచనల నుంచి రాహుల్ గాంధీ నన్ను కాపాడారు.. ఎమోషనల్‌గా సపోర్ట్ చేశారు: కన్నడ నటి దివ్య స్పందన

By Mahesh KFirst Published Mar 30, 2023, 1:31 PM IST
Highlights

కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన ఆత్మహత్య ఆలోచనలకు లోనైనట్టు ఇటీవల వెల్లడించింది. తండ్రి మరణం, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ఆత్మహత్య ఆలోచనలకు లోనైనట్్టు వివరించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు హెల్ప్ చేశాడని తెలిపింది. ఎమోషనల్‌గా సపోర్ట్ చేశాడని పేర్కొంది.
 

న్యూఢిల్లీ: కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు దివ్య స్పందన ఆత్మహత్య  ఆలోచనలు చేసినట్టు ఇటీవలే వెల్లడించింది. ఆమె తండ్రి మరణం తర్వాత తీవ్ర ఒత్తిడి లోనైందని చెప్పింది. ఆత్మహత్య ఆలోచనలు చేసిన ఆమెకు ఎమోషనల్‌గా రాహుల్ గాంధీ ఎంతో సపోర్ట్ ఇచ్చారని వివరించింది.

ఓ కన్నడ టాక్ షోలో ఆమె తన తండ్రి మరణం గురించి ఓపెన్ అయ్యారు. ‘నాన్నను కోల్పోయిన రెండు వారాల తర్వాత నేను పార్లమెంటుకు వెళ్లాను. నాకు అప్పుడు పార్లమెంటులో ఎవరూ తెలియదు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ గురించి కూడా తెలియదు’ అని ఆమె పేర్కొంది. మెల్లమెల్లగా తాను ఆ విషయాలన్నింటినీ నేర్చుకున్నట్టు వివరించింది. తన బాధను పనిలోకి మళ్లించిందని పేర్కొంది. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గ ప్రజలు తనలో ఆత్మస్థైర్యాన్ని నింపారని వివరించింది.

తన ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నప్పుడు రాహుల్ గాంధీ తనకు మద్దతుగా నిలబడ్డారని పేర్కొంది. ‘నాపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నాన్న ప్రభావం ఎక్కువ. వీరిద్దరి తర్వాత రాహుల్ గాంధీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది’ అని ఆమె తెలిపింది.

తండ్రి మరణం తర్వాత తనలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని ఆమె చెప్పింది. ఆ తర్వాత తాను ఎన్నికల్లోనూ ఓడిపోయినట్టు వివరించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు సహకరించినట్టు పేర్కొంది. తనకు ఎమోషనల్‌గా మద్దతు కూడా ఇచ్చారని వివరించింది.

Also Read: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షా తో కీలక భేటీ.. ముందస్తు ఎన్నికల కోసమేనా..?

2012లో ఆమె యూత్ కాంగ్రెస్‌లో చేరింది. 2013లో జరిగిన ఉపఎన్నికలో మాండ్యా నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గానూ ఆమె చేసింది. ఆ తర్వాత పోస్టు వదిలిపెట్టింది. గత ఏడాదిలోనే ఆమె తిరిగి సినిమాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించింది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్‌ ప్రారంభించింది.

click me!