బీజేపీ అవినీతిపై అంతా కలిసి పోరాడుతాం: రాహుల్ గాంధీ

By Nagaraju TFirst Published Dec 10, 2018, 6:45 PM IST
Highlights

మోదీ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అవినీతికి రాఫెల్ కుంభకోణమే అందుకు నిదర్శనమని రాహుల్ తెలిపారు. పార్లమెంట్ అనెక్స్ హాలులో జరిగిన బీజేపీయేతర సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు తెలియజేశారు. 

ఢిల్లీ: మోదీ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అవినీతికి రాఫెల్ కుంభకోణమే అందుకు నిదర్శనమని రాహుల్ తెలిపారు. పార్లమెంట్ అనెక్స్ హాలులో జరిగిన బీజేపీయేతర సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు తెలియజేశారు. 

ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చెయ్యడమే కాకుండా రాజ్యాంగ సంస్థలను సైతం నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు సైతం నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. 

జీఎస్టీ వల్ల దేశంలో చిరు వ్యాపారస్థుల నుంచి సామాన్యుడు వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిత తెలిపారు. జీఎస్టీ భారం వ్యాపారులకు పెద్ద సమస్యగా మారిందన్నారు. నోట్ల రద్దు అనేది తప్పుడు నిర్ణయం అంటూ రాహుల్ అభిప్రాయపడ్డారు. 

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ కుంభకోణం అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సమస్యలపై మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నట్లు స్పష్టం చేశారు. 

అలాగే బీజేపీకి వ్యతిరేకంగా అటు  పార్లమెంట్ లోనూ బయట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై చర్చించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం బీజేపీయేతర కూటమి నేతలంతా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలవనున్నట్లు తెలిపారు. 

జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ అనెక్స్ హాలులో దాదాపు 14 పార్టీల అధినేతలు సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో సేవ్ ది నేషన్, సేవ్ ది డెమెక్రసీ వంటి అంశాలై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈనెల 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే కూటమి కామన్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ పైనా నేతలు చర్చించారు. 
 

click me!