కొత్త అధ్యక్షుడి ఎంపికలో తలదూర్చను: రాహుల్

Siva Kodati |  
Published : Jun 20, 2019, 03:53 PM IST
కొత్త అధ్యక్షుడి ఎంపికలో తలదూర్చను: రాహుల్

సారాంశం

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించారు. సోనియాతో పాటు పార్టీ పెద్దలు వారించినప్పటికీ ఆయన మాత్రం అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించారు. సోనియాతో పాటు పార్టీ పెద్దలు వారించినప్పటికీ ఆయన మాత్రం అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు.

ఈ క్రమంలో తదుపరి అధ్యక్ష ఎన్నికపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఏ వ్యవస్థలోనైనా జవాబుదారీతనం ఉండాలని... అలాగే పార్టీలోనూ... కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి ఎంపికలోనూ తాను భాగం కాదలుచుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.

ఆ విషయంలో తన జోక్యం అనవసరమని... తన జోక్యం ఉంటే ఎలా ఉంటుందో చెప్పలేనని అధ్యక్షుడిగా సరైన వ్యక్తిని పార్టీయే ఎంపిక చేస్తుందని రాహుల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Maharashtra Deputy CM Ajit Pawar Dies: A Political Era Comes to an End | Asianet News Telugu
Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ మృతిపై కేంద్ర మంత్రి సంతాపం | Asianet News Telugu