
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.
ఈ క్రమంలో సేమ్ పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలించే సీన్ రిపిట్ అయింది. వెంబడిస్తున్న పోలీసులకు తప్పించుకోవడానికి స్మగ్లర్లు నానా ప్రయత్నాలు చేశారు. పోలీసులు ముందుకు రాకుండా.. పోలీసు వాహనానికి అడ్డంగా గంజాయి మూటలను వేశారు. అయినా పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంత వేగంగా వెళ్లినా స్మగ్లర్లను మాత్రం వెంబడిస్తునే వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్ల నుంచి దాదాపు రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.