హత్య చేసి.. ఫేస్ బుక్ లో పోస్టు

Published : Nov 21, 2019, 07:22 AM IST
హత్య చేసి.. ఫేస్ బుక్ లో పోస్టు

సారాంశం

భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పు  చేస్తే తాము వంద రౌండ్ల కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించాడు. ఇందులో పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ అమాయకులపై కేసులు నమోదు చేయకూడదంటూ అతను పేర్కొన్నాడు.  

పాత కక్షల నేపథ్యంలో ఓ గ్యాంగ్ స్టర్ తన శత్రువుని అతి దారుణంగా హత్య చేశాడు.  హత్య చేసింది గాక... అది చేసింది తానే అంటూ అతను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సర్వత్రా కలకలం రేగింది. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పండోరి గ్రామానికి చెందిన మణిదీప్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం స్కూటర్ పై వెళ్తుండగా హర్విందర్ సింగ్ అనే గ్యాంగస్టర్ వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన చేతిలోని తుపాకీతో మణిదీప్ సింగ్ పై కాల్పలు జరిపాడు. దాదాపు 8సార్లు అతనిపై కాల్పులు జరపగా.. మణిదీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

హత్య చేయడమే కాకుండా చేసింది తానే అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేయడం విశేషం. పండోరీలో మణిదీప్ ని హత్య చేసింది తానేనని.. పాతకక్షల కారణంగా తమ గౌరవం కోసం అతనిని చంపినట్లు చెప్పాడు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పు  చేస్తే తాము వంద రౌండ్ల కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించాడు. ఇందులో పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ అమాయకులపై కేసులు నమోదు చేయకూడదంటూ అతను పేర్కొన్నాడు.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వారి పట్టుకొని తీరతామని చెప్పారు. పలుకోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ
Young Blood Takes Over BJP! | 45 ఏళ్ల నితిన్ నబిన్… BJP లో పవర్ షిఫ్ట్! | Asianet News Telugu