Punjab elections 2022: అప్ సీఎం అభ్య‌ర్థికి ఈసీ షాక్.. నోటీసులు జారీ

By Rajesh KFirst Published Jan 24, 2022, 1:44 PM IST
Highlights

Punjab elections 2022:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం( ఈసీ) ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌కి నోటీసు పంపింది. ఆదివారం సంగ్రూర్ జిల్లాను సందర్శించినప్పుడు కోవిడ్ 19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి భారత ఎన్నికల సంఘం నోటీసు పంపింది. 
 

Punjab elections 2022:  వ‌చ్చే నెల‌లో ప్ర‌తిష్టాత్మకంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగనున్నాయి. ఈ ఇందు కోసం ప్రధాన పార్టీలు సిద్ద‌మ‌వుతున్నాయి. అయితే .. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల  డిజిట‌ల్ ప్రచారం నిర్వహించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు సాంకేతిక ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. వర్చువల్​గా బహిరంగ సభలు వంటివి నిర్వహించేందుకు ప్రణాళిక ర‌చిస్తున్నారు. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం సాగిస్తున్నాయి. 

కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో వర్చువల్‌ ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ సూచనల‌ మేరకు యూపీలో రాజకీయ పక్షాలు సాంకేతిక సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని ఈసీ ప్రకటించింది.

తాజాగా.. AAP డిజిటల్ ప్రచారాన్ని ఢిల్లీ  సీఎం, అప్ క‌న్వీన‌ర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ ఆప్ .. యూపీలో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్,గోవా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. AAP ప్రభుత్వం పనితీరు గురించి మీరే వీడియో చేయండి.  ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయండి 
 
 ఇదిలాఉంటే..  కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం( ఈసీ) ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌కి నోటీసు పంపింది. ఆదివారం సంగ్రూర్ జిల్లాను సందర్శించినప్పుడు కోవిడ్ 19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి భారత ఎన్నికల సంఘం నోటీసు పంపింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు నిన్న తన ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 31 వరకు ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాల తర్వాత కూడా, కోవిడ్ నిబంధనలను మాన్ బహిరంగంగా ఉల్లంఘించడం కనిపించింది. పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. వారు స్థానికుల‌ మాత్రమేన‌నీ, కార్య‌క‌ర్త‌లు కాద‌ని, అయితే ఆయన పర్యటన వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో దీనిపై ఈసీ చ‌ర్య‌లు తీసుకుంది.   

క‌రోనా కేసుల పెరుగుతుండ‌టంలో.. ఎన్నికల సంఘం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై ఆంక్షాలు విధించింది.   కోవిడ్-19 దృష్ట్యా మార్గదర్శకాలు జారీ చేసింది, తొలుత ఈ నెల జనవరి 15 వరకు రోడ్‌షోలు, ర్యాలీలను నిషేధించింది. ఆ నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది.  

ఈ త‌రుణంలో ఇత‌ర ప్ర‌ధాన పార్టీలు కూడా కరోనా పరిస్థితుల్లో వాటిని రెండువారాల పాటు వాయిదా వేసుకుని, ఇప్పుడు డిజిటల్‌ ర్యాలీల్లో పాల్గొన‌బోతున్నారు. 

click me!