వద్దంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కుందని.. భార్యను చంపడానికి సుపారీ ఇచ్చిన భర్త...

Published : Jan 24, 2022, 12:53 PM IST
వద్దంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కుందని.. భార్యను చంపడానికి సుపారీ ఇచ్చిన భర్త...

సారాంశం

ఆ కాంట్రాక్ట్ కిల్లర్ల మహిళ మీద నిందితులు పదునైన వస్తువులతో దాడిచేసి.. గాయపర్చడంతో మహిళ గొంతుకు గాయమయ్యింది. ఆమెకు ఏడు కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కోల్‌కతా.. దక్షిణ శివార్లలోని నరేంద్రపూర్‌లో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కోల్‌కతా : Kolkataలో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. భార్యను murder చేయడానికి ఏకంగా contract killerలను నియమించుకున్నాడు. వారికి సుపారీ ఇచ్చి మరీ పనికి పురమాయించాడు. సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యమీద ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏంటంటే.. ఆమె భర్త అనుమతి లేకుండి smart phone కొనుక్కోవడమేనని తేలింది. 

ఆ కాంట్రాక్ట్ కిల్లర్ల మహిళ మీద నిందితులు పదునైన వస్తువులతో దాడిచేసి.. గాయపర్చడంతో మహిళ గొంతుకు గాయమయ్యింది. ఆమెకు ఏడు కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కోల్‌కతా.. దక్షిణ శివార్లలోని నరేంద్రపూర్‌లో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారిలో మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... “మహిళ చెబుతున్న దాని ప్రకారం, ఆమె కొన్ని నెలల క్రితం తన భర్తను స్మార్ట్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. దీంతో ట్యూషన్‌ లు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తున్న మహిళ.. ఆ డబ్బుతో జనవరి 1న స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతను కోపోద్రిక్తడయ్యాడు. మహిళను చంపేస్తానని బెదిరించాడు”

ఎప్పటిలాగే గురువారం రాత్రికూడా ఇంటి మెయిన్‌ డోర్‌కు తాళం వేసిన భర్త తిరిగి రాలేదు. అతను ఎంత సేపటికీ తన రూంలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య.. భర్త కోసం బైటికి వెళ్లి చూసింది. ఇంతలో అప్పటికే అక్కడ కాపు వేసిన ఇద్దరు వ్యక్తులు ఆమె మీద దాడి చేశారు. పదునైన ఆయుధాలతో గొంతు కోశారు. అనుకోని ఈ పరిణామానికి మహిళ షాక్ తిన్నది. 

ఈ దాడిలో మహిళకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఎలాగో వారినుంచి తప్పించుకున్న మహిళ ఇంట్లోనుంచి పారిపోయి.. రక్షించమంటూ గట్టిగా కేకలు వేసింది. మహిళ అరుపులకు అలర్ట్ అయిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. వీరు దుండగుల్లో ఒకరిని, భర్తను పట్టుకున్నారు. అయితే, మరో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. మహిళ భర్త రాజేష్ ఝా, కిరాయి దుండగుడిని సూరజిత్‌గా గుర్తించారు. 

ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో తన భార్యతో Obsceneగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిమీద దాడి చేసిన నిందితుడు అతడి eyeలో ఐసు ముక్కతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దేశ రాజధాని ఢిల్లీలోని టాగోర్ గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు స్థానికులకు చిక్కగా వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు బబ్లూ.. కుక్రేజా ఆస్పత్రి సమీపంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఊరుకోకుండా దుర్భాషలాడడంతో.. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె భర్త బబ్లూతో వాగ్వివాదానికి దిగాడు. అది క్రమంగా ముదరింది. దీంతో పట్టలేని కోపంతో ఎలాగైనా బబ్లూ పని పట్టాలనుకున్నాడు. తన స్నేహితులకు సమాచారం అందించి పిలిపించాడు. వారిలో కలిసి బబ్లూ మీద దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగా మంచు ముక్కతో బబ్లూ కుడి కంటిలో పొడిచాడు.

 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !