Punjab Election 2022 : పంజాబ్ లో మా పోరాటం వచ్చే ఎన్నికల కోసం కాదు.. తరువాతి తరం కోసం..

Published : Feb 13, 2022, 03:09 PM ISTUpdated : Feb 13, 2022, 04:17 PM IST
Punjab Election 2022 :  పంజాబ్ లో మా పోరాటం వచ్చే ఎన్నికల కోసం కాదు.. తరువాతి తరం కోసం..

సారాంశం

కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పోరాటం చేయడం లేదని, తరువాతి తరం కోసం పోరాటం చేస్తోందని ఆ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

Punjab Election News 2022 :  తమ పార్టీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోరాడటం లేదని, రాబోయే తరం కోసం పారాటం చేస్తోందని పంజాబ్ (punjab) కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) అన్నారు. ఆదివారం ఆయ‌న ఎన్నారై కమ్యూనిటీ (NRI community)తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లోని త‌రువాత త‌రానికి మంచి చేయాల‌ని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ (congress party) పని చేస్తుంద‌ని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక మేనిఫెస్టో (menifesto) విడుద‌ల చేయ‌డానికి ముందే శ‌నివారం నవజ్యోత్ సింగ్ సిద్ధూ 13 పాయింట్ల ‘పంజాబ్ మోడల్ (punjab model)’ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గురునానక్ తత్వశాస్త్రం లోని ‘తెరా-తేరా’ (thera -thera), ‘సర్బత్ ద భలా’ (Sarbat Da Bhala), పంచాయితీలు, పట్టణ స్థానిక సంస్థల సాధికారత కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  (former Prime Minister Rajiv Gandhi) ఆలోచ‌న‌ల నుంచి ప్రేరణ పొందిందని చెప్పారు.

ఈ 13 పాయింట్ల ఎజెండాలో వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, మహిళా సాధికారత, ఆరోగ్య సంరక్షణ, పాలన, సామాజిక సేవ, నైపుణ్యం, వ్యవస్థాపకత, పరిశ్రమలు, శాంతి భద్రతలు, పర్యావరణం, పౌర సౌకర్యాలు, చట్టం వంటి అంశాలు ఉన్నాయి. ఇందులో డిజిటలైజేషన్ (digitalization), విద్యకు ప్ర‌ధాన్య‌త ఇచ్చారు. అయితే తన కొత్త మోడల్‌ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన బ్లూప్రింట్ (blue print)ను మ్యానిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై సింబాలిక్ గా ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ సీఎం అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi) ని పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ మోడల్ వచ్చింది. సిద్ధూ మోడల్‌ను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని రాహుల్ గాంధీ గ‌తంలో చెప్పారు.

పంజాబ్ (punjab) లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల‌కు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. కాగా పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే సిద్ధూకు సూపర్ సీఎం పదవి వస్తుందని ఆ పార్టీ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇటీవల వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ నుంచి పంజాబ్ సీఎం అభ్య‌ర్థిగా చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని రాహుల్ గాంధీ (rahul gandhi)ప్ర‌క‌టించారు. ‘‘ పేదరికం, ఆకలిని అర్థం చేసుకునే ‘గరీబ్ ఘర్’ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పంజాబ్ ప్రజలకు చాలా అవసరమని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నారు. ఈ నిర్ణయాన్ని న‌వజ్యోత్ సింగ్ సిద్దూ స్వాగతించారు. అధిష్టానం నిర్ణ‌యంతో ఎవ‌రికీ ఎలాంటి స‌మ‌స్య లేద‌ని చెప్పారు. ఇది ఇలా ఉండ‌గా న‌వజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ ఎన్నికల్లో అమృత్‌సర్ ఈస్ట్ (Amritsar-East) నుంచి పోటీ చేస్తుండగా, చన్నీ రాష్ట్రంలోని రూప్‌నగర్‌లోని చమ్‌కౌర్ సాహిబ్ (Chamkaur Sahib) నియోజకవర్గం నుంచి,  బర్నాలా జిల్లాలోని బదౌర్ (Bhadaur)నుంచి పోటీ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?