
చండీఘడ్ : ప్రధాని Narendra Modi కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫిరోజ్పూర్ లో ఫ్లై ఓవర్ పై ఇరుక్కుపోయిన ఘటనపై పంజాబ్ సీఎం Charanjit Channi వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి security lapse లేవన్నారు. ప్రధాని పై attackకి ఎలాంటి ప్రయత్నము జరగలేదని స్పష్టం చేశారు.
తమ రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన ప్రధాని ఢిల్లీకి వెనుదిరగడంపై విచారణ వ్యక్తం చేశారు. Prime Minister's visit కు అడ్డంకులు ఏర్పడటంపై చింతిస్తున్నాం అని అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్డుపై కూర్చుని నిరసన తెలుపుతున్న వారికి ముందే ప్రధాని కాన్వాయ్ ఆగిపోయింది అన్నారు. నిరసనకారులని అక్కడి నుంచి తొలగించేందుకు 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని.. వేరే రూట్లో వెళ్లాలని సూచించినా.. వారు ఇదే దారి ఎంచుకున్నారని చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఏ అధికారి సస్పెండ్ చేయమని స్పష్టం చేశారు. బటిండా నుంచి ఫిరోజ్పూర్ కు ప్రధాని ప్రయాణ ప్రణాళికలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుందని.. దీన్ని బిజెపి రాజకీయం చేయొద్దని సూచించారు. విమానాశ్రయంలో ప్రధానిని తానే రిసీవ్ చేసుకోవాల్సి ఉందని కాకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తికి కరోనాపాజిటివ్ రావడంతో తాను వెళ్ళలేకపోయాను అని అన్నారు. ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు ఏదైనా భద్రతాపరమైన లోపం ఉందంటే విచారణ జరిపిస్తామని అన్నారు.
ప్రధాని మోడీ పర్యటన రద్దుపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే..?
ఇదిలా ఉండగా, మంగళవారం పంజాబ్ లో జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన మొదలుకాకముందే ఆగిపోయింది. భటిండా ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రధాని మోడీ ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలా గ్రామంలోని నేషనల్ మార్టిర్స్ మెమోరియల్ వెళ్లాలి. ఫిరోజ్‌పుర్‌లో BJP Rallyలోనూ మాట్లాడాల్సి ఉంది. కానీ, ప్రధాని మోడీ భటిండా ఎయిర్‌పోర్టు చేరిన తర్వాత అక్కడి నుంచి ఫిరోజ్‌పుర్‌కు హెలికాప్టర్ వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. కానీ, వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో రోడ్డుమార్గం గుండానే కార్ల కాన్వాయ్‌లో ఫిరోజ్‌పుర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
కానీ, ఫిరోజ్‌పుర్ వెళ్లక ముందే మధ్యలో రైతు ఆందోళనకారుల ప్రదర్శన కారణంగా ఓ ఫ్లై ఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ సుమారు 15 నుంచి 20 నిమిషాలు నిలిచిపోయింది. ఈ అడ్డగింపుతో ప్రధాని మోడీ ఆ కార్యక్రమాలకు హాజరవ్వకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రధాన మంత్రికి పటిష్ట భద్రత కల్పించకపోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని, పంజాబ్ ప్రభుత్వం ప్రధానికి భద్రత కల్పించడంలో విఫలమైందని కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది.
నేను ప్రాణాలతో బయటపడ్డా.. పంజాబ్ సీఎంకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి: అధికారులతో మోడీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే, ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం వాదనలు భిన్నంగా ఉన్నాయి. చివరి నిమిషంలో మార్పుల వల్లే ఇలా జరిగిందని వారు చెబుతున్నారు.